ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: మల్బరీ పండ్లు ఎప్పుడైనా తిన్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..

ABN, Publish Date - Oct 18 , 2024 | 05:37 PM

మల్బరీ పండ్ల గురించి చాలా మంది పేరు వినడమే కానీ వాటిని తినేవారు తక్కువ. మల్బరీ పండ్లను ఆహారంలో చేర్చుకుంటే ఏం జరుగుతుందంటే..

Mulberry

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. జామ, యాపిల్, నారింజ, పైనాపిల్ వంటి పండ్లు ఎప్పుడూ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఇవి చాలామందికి తెలిసిన పండ్లే. వీటిని తరచుగా కొనుగోలు చేసి తింటుంటారు కూడా. అయితే మల్బరీ పండ్లు మాత్రం అందరికీ అందుబాటులో ఉండవు కానీ పండ్లు తింటే ఒకటి, రెండు కాదు.. లెక్కలేనన్ని లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతో రుచికరంగా ఉండే ఈ పండును తింటే కలిగే ప్రయోజనాలేంటో.. ఇందులో ఉండే పోషకాలేంటో తెలుసుకుంటే..

Health Tips: రాత్రి సమయంలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే జాగ్రత్త పడాల్సిందే..!


పోషకాలు..

మల్బరీలో విటమిన్-సి, విటమిన్-కె తో పాటు విటమిన్-బి వర్గానికి చెందిన విటమిన్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

జీర్ణక్రియ..

మల్బరీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యం చక్కగా ఉండేలా చేస్తుంది.

గుండె..

మల్బరీ తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటు కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మల్బరీ తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Kitchen Tips: అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రిడ్జ్ లో పెట్టడం మంచిదేనా దీన్నెలా నిల్వ చేయాలంటే..


రోగనిరోధక శక్తి..

మల్బరీలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మల్బరీని తింటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ఊబకాయం..

మల్బరీ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మల్బరీ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకుంటే కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంచుతుంది. దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

చర్మం..

చర్మ ఆరోగ్యం బాగుండాలంటే మల్బరీ ని డైట్ లో చేర్చుకోమని ఆహార నిపుణులు, చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. మల్బరి తీసుకుంటే చర్మం మెరుస్తుంది. చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఇవి కూడా చదవండి..

Health Tips: వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 18 , 2024 | 05:37 PM