ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: రాత్రి సమయంలో మీకు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే జాగ్రత్త పడాల్సిందే..!

ABN, Publish Date - Oct 18 , 2024 | 02:20 PM

రాత్రి పడుకున్నప్పుడు కొందరికి హాయిగా నిద్ర పడితే.. మరికొందరికి మాత్రం చాల అసౌకర్యంగా అనిపిస్తుంది. రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంట.

శరీరం అలసిపోయినా, కష్టమైన పనులు చేసినా, ఎక్కువ దూరం నడిచినా, శరీరంలో నీటి శాతం తగ్గినా నోరు తడి ఆరిపోతుంది. శరీరానికి నీటి అవసరాన్ని తెలిపే ఒక సంకేతం ఇది. ఎంత నీరు తాగినా, ఆహారం బాగా తీసుకున్నా కొందరికి రాత్రి సమయంలో నోరు తడి ఆరిపోతుంటుంది. దీని వల్ల నిద్ర మధ్యలో మెలకువ కూడా వస్తుంది. ఇది మాత్రమే కాకుండా రాత్రి సమయంలో కొందరికి చాలా రకాల ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగుతుంటాయి. ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నవారిలో జరగవు. అయితే ఇలాంటి లక్షణాలను తేలిగ్గా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాప కింద నీరులా శరీరంలో చేరే సమస్యకు ఇవి పెద్ద సంకేతం అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

పూజ కోసం వాడిన పువ్వులను ఇలా ఉపయోగిస్తారని మీకు తెలుసా..


డయాబెటిస్..

డయాబెటిస్ అనేది ఈ మధ్యకాలంలో చాలా సాధారణం అయినప్పటికీ దీన్ని నయం చేయడం మాత్రం కష్టం. ముఖ్యంగా జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల డయాబెటిస్ సమస్య వస్తుంది. పేలవమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వంటి అలవాట్ల వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ. డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్న వారిలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఇవి బాగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నవారిలో కనిపించే లక్షణాల గురించి తెలుసుకుంటే..

ఈ పండ్లు తినండి రక్తంలో చక్కెర స్థాయిలకు చెక్ పెట్టచ్చు..


పాదాలలో జలదరింపు..

రాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పాదాలలో జలదరింపు అనిపించినట్లయితే లేదా పాదాలు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లయితే శరీరంలో చక్కెర స్థాయి పెరగడం ప్రధాన కారణం కావచ్చు.

చెమట..

రాత్రి ఫ్యాన్‌ని ఆన్ చేసిన తర్వాత కూడా చెమటలు పడుతున్నా, ఇలా దాదాపు ప్రతిరోజూ జరుగుతున్నా, గ్లూకోజ్ స్థాయిని పరీక్షించుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా మధుమేహం ప్రధాన లక్షణం అంటున్నారు.

అసౌకర్యం..

రాత్రి నిద్రిస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించినా, హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగినట్లున్నా ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరగిందనడానికి సంకేతమట. దీన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని అంటున్నారు.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?


నోరు పొడిబారడం..

రాత్రి నిద్రిస్తున్నప్పుడు నోరు పొడిబారడం, చాలా దాహంగా అనిపించడం కూడా మధుమేహం లక్షణం కావచ్చు.

మూత్రవిసర్జన..

మధుమేహం ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో రాత్రిపూట మూత్ర విసర్జనకు చాలాసార్లు లేవాల్సి వస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో లేదని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి..

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

బాదం తొక్కలు పడేస్తుంటారా? ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 18 , 2024 | 02:20 PM