Health Tips: దీపావళికి ముందు అనారోగ్యం చేయకూడదంటే ఇలా ఇమ్యునిటీ పెంచుకోండి..!
ABN, Publish Date - Oct 28 , 2024 | 01:37 PM
శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా, పండుగ ముందు అనారోగ్యం బారిన పడకూడదన్నా ఈ చిట్కాలు పాటించాలి.
దీపావళి భారదేశ వ్యాప్తంగా జరుపుకునే హిందూ పండుగ. విదేశాలలో కూడా ఈ పండుగను వివిధ కారణాలతో జరుపుకుంటారు. పండుగకు ముందు పండుగ ఏర్పాట్లన్నీ సజావుగా చేసుకోవాలన్నా, పండుగ రోజు సంతోషంగా గడపాలన్నా ఆరోగ్యం బావుండాలి. దీపావళి పండుగకు ముందే ఆరోగ్యాన్ని బలపరుచుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి ఏం చేయాలంటే..
తేనె గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..
రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి అగ్రస్థానంలో ఉంది. బెర్రీలు, నిమ్మ, నిమ్మ జాతి పండ్లైన నారింజ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవాలి. గంటకు ఒకసారి అయినా ఈ పండ్లలో ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి.
ప్రేగు ఆరోగ్యాన్ని, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్ ఎ సహాయపడుతుంది. క్యారెట్లు, బచ్చలికూర, చిలగడదుంప, గుమ్మడికాయ, సీతాఫలం మొదలైన వాటిలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్ళగానే విటమిన్ A గా మారుతుంది .
విటమిన్ ఇ శరీరానికి సమృద్దిగా లభించాలంటే విత్తనాలు, గింజలు బాగా తీసుకోవాలి. అదే విధంగా గట్ ఫ్లోరాను ఆరోగ్యంగా ఉంచడానికి, రోగనిరోధక వ్యవస్థను బలపరిచేందుకు ప్రోబయోటిక్స్‌ను తీసుకోవాలి. పెరుగు, దోశ, ఇడ్లీ, పులియబెట్టిన గంజి అన్నం, మజ్జిగ వంటివి బాగా తీసుకోవాలి.
Health Tips: రాత్రి సమయంలో భోజనం స్కిప్ చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..
రోగనిరోధక శక్తిని బలంగా మార్చేందుకు విటమిన్ డి సహాయపడుతుంది. దీనికోసం వారానికి కనీసం మూడుసార్లు లేత సూర్యరశ్మిలో గడపాలి.
యాంటీఆక్సిడెంట్లతో నిండిన గ్రీన్ టీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీన్ని వేడిగా, చల్లగా తీసుకోవ్చచు. రోగనిరోధక వ్యవస్థ బలంగా మారాలి అంటే ఖనిజాలు కూడా అవసరం. జింక్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.
శరీరాన్ని, కండరాలను బలపరచడానికి వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక కణాలు ఉత్పత్తి అవుతాయి. అందుకే పండుగకు ముందు హడావిడిలో వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అదే విధంగా శరీరానికి తగిన విశ్రాంతి కూడా అవసరం. ఇది శరీరంలో శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..
Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 28 , 2024 | 01:37 PM