Health Tips: జీడిపప్పు, బాదం కంటే శక్తివంతమైన డ్రై నట్ గురించి తెలుసా?
ABN, Publish Date - Sep 16 , 2024 | 11:44 AM
డ్రై నట్స్ లో ముఖ్యంగా జీడిపప్పు, బాదం వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి ధర కూడా ఎక్కువే. వీటికి ధీటుగా, వీటి గంటే తక్కువ ధరలో లభించే డ్రై నట్ గురించి చాలా మందికి తెలియదు.
డ్రై నట్స్ శరీరానికి చాలా ఆరోగ్యం చేకూరుస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉండటం వల్ల డ్రై నట్స్ ను తీసుకుంటే శరీరానికి చాలా శక్తి లభిస్తుంది. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే చాలా వరకు పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని చెబుతుంటారు. డ్రై నట్స్ లో ముఖ్యంగా జీడిపప్పు, బాదం వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి ధర కూడా ఎక్కువే. వీటికి ధీటుగా, వీటి గంటే తక్కువ ధరలో లభించే డ్రై నట్ గురించి చాలా మందికి తెలియదు. అదేంటో.. అది శరీరానికి ఎలా ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే..
రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
వేరుశనగ..
బాదం, జీడిపప్పు కంటే భారతీయులకు సరసమైన ధరలో లభించే డ్రై నట్ గా వేరుశనగను చెప్పవచ్చు. భారతీయులు వేరుశనగను చాలా విరివిగా ఉపయోగిస్తారు. బాదం, జీడిపప్పు కంటే ఎక్కువ పోషకాలు వేరుశనగలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు చాలా అవసరం.
వేరుశనగలో మోనో శాచురేటెడ్ ఫ్యాట్, పాలీ శాచురేటెడ్ ప్యాట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.
వేరుశనగలో పైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజూ గుప్పెడు వేరుశనగలు తింటూ ఉంటే మంచిది.
నానబెట్టిన ఎండుద్రాక్షను నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
వేరుశనగలో విటమిన్-బి3(నియాసిన్) రెస్పెరాట్రాల్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును ప్రోత్సహిస్తాయి.
వేరుశనగలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాల్సి వచ్చినప్పుడు వేరుశనగలు తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.
వేరుశనగలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. మలబద్దకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
వేరుశనగలలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, బలంగా మార్చడంలోనూ సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి..
రోజూ నానబెట్టిన పెసరపప్పు తింటే ఏం జరుగుతుందంటే.. !
ఖాళీ కడుపుతో అంజీర్ నీరు తాగితే ఏం జరుగుతుందంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 16 , 2024 | 12:03 PM