Health Tips: వెల్లుల్లి ఇలా తింటే యూరిక్ యాసిడ్ సమస్య మాయం..
ABN, Publish Date - Nov 04 , 2024 | 04:57 PM
యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని ఇలా తీసుకుంటే ఎంత తొందరగా సమస్య తగ్గుతుందో..
వెల్లుల్లి ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే మసాలా దినుసు. ఇది ఆహారానికి రుచిని, వాసనను ఇవ్వడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ఆయుర్వేదంలో వెల్లుల్లిని గొప్ప ఔషదంగా చెబుతారు. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుందని అంటున్నారు. యూరిక్ యాసిడ్ సమస్య తగ్గాలంటే వెల్లుల్లిని ఎలా తినాలి? వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే..
Health Tips: హ్యాంగోవర్ వేధిస్తుందా.. ఇలా చేస్తే మాయం..
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్లలో వాపు, వేళ్లలో వాపు, గౌట్ వంటి సమస్యలు వస్తాయి. వీటి వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవనశైలికి చాలా ఆటంకం కలుగుతుంది. రోజువారీ పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వెల్లుల్లిని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ ను తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని వాటిని పచ్చిగా తినాలి. ఇలా చేస్తే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి మందులతో అవసరం లేకుండా తగ్గుతుంది. వెల్లుల్లిని ఇలా పచ్చిగానే కాకుండా కూరలు, సూప్ లు, సలాడ్ లలో కూడా జోడించవచ్చు.
కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటూ ఉంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా వెల్లుల్లిని తినడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి. ఈ కారణంగా శరీరం శుద్ది అవుతుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ కూడా తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Health Tips: ప్రాణాయామంలో ఈ ఒక్క ట్రిక్ ఫాలో అయితే.. 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ..
Health Tips: ఖర్జూరం విత్తనాల కాఫీ ఎప్పుడైనా తాగారా.. దీంతో ఎన్ని లాభాలంటే..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 04 , 2024 | 04:57 PM