ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఈ 3 తినండి చాలు.. 60 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:34 PM

వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది. ఎముకలు, కండరాల శక్తి తగ్గడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, కూర్చుని లేవడంలో ఇబ్బంది.. ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక చర్మం ముడుతలు పడటం, జుట్టు నెరిసిపోవడం ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా కనిపించాలని ఎవరూ కోరుకోరు. 60 ఏళ్ల వయసొచ్చినా యవ్వనంగా కనిపించాలంటే..

వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడుతుంది. ఎముకలు, కండరాల శక్తి తగ్గడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, కూర్చుని లేవడంలో ఇబ్బంది.. ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఇక చర్మం ముడుతలు పడటం, జుట్టు నెరిసిపోవడం ఎక్కువగా ఉంటాయి. కానీ ఇలా కనిపించాలని ఎవరూ కోరుకోరు. 60 ఏళ్ల వయసొచ్చినా యవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే కేవలం మూడు రకాల డ్రై ఫ్రూట్స్ తింటే చాలు.. అవేంటో తెలుసుకుంటే..

బాదం..

బాదం మంచి డ్రై ఫ్రూట్. ఇది చర్మం, జుట్టు రెండింటికి ఆరోగ్యం చేకూరుస్తుంది. బాదంలో ఫైబర్, విటమిన్-ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, పొటాషియం, జింక్, బి- విటమిన్లు, నియాసిన్, థయామిన్, ఫోలెట్ వంటివి కూడా ఉంటాయి. రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుంతుంది. ఇందులో పైబర్ బరువును కంట్రోల్ లో ఉంచుతుంది. బాదంలో ఉండే విటమిన్-ఇ యవ్వనంగా ఉంచుతుంది.

White Bread: అల్పాహారంలో బ్రెడ్ జామ్ తింటూంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!



వాల్నట్స్..

వాల్నట్స్ ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్. దీన్ని నానబెట్టి తింటే మరిన్ని లాభాలు ఉంటాయి. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్, ఒమెగా-3, పోషకాలు ఆరోగ్యానికి చాలామంచివి.

ఎండుద్రాక్ష..

ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం మెరుపు రెట్టింపు అవుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. జీర్ణశక్తిని బలంగా ఉంచుతుంది.

Black Chickpeas: నల్ల శనగలు ఇలా తిని చూడండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!

Indigestion: అజీర్తి వేధిస్తోందా? ఈ టిప్స్ తో తొందరగా తగ్గించేయచ్చు..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 30 , 2024 | 12:34 PM

Advertising
Advertising