ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: జీడిపప్పు తింటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా.. అసలు నిజాలు ఇవీ..

ABN, Publish Date - Oct 21 , 2024 | 12:08 PM

జీడిపప్పు చాలా రుచిగా ఉంటాయి. కానీ వీటిని తింటే బరువు పెరుగుతారా లేక తగ్గుతారా అనేది చాలా మందికి తెలియదు.

Cashew

జీడిపప్పు చాలా రుచికరమైన డ్రై నట్స్ లో ఒకటి. జీడిపప్పు జోడించిన వంటకాలు అదనపు రుచితో ఇంకా తినాలనిపించేలా చేస్తాయి. స్వీట్ల నుండి మసాలా వంటల వరకు.. చాలా రకాలుగా జీడిపప్పును తింటారు. ఆరోగ్యకరమైన డైట్ ఫాలో అయ్యేవారు రోజులో కొన్ని జీడిపప్పులు తప్పనిసరిగా తింటూ ఉంటారు. కొందరు బరువు తగ్గే ప్రయత్నాలలో జీడిపప్పును తింటే.. మరికొందరు బరువు పెరగడం కోసం తింటుంటారు. అసలు జీడిపప్పు తింటే బరువు తగ్గుతారా లేగా పెరుగుతారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..

పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..


జీడిపప్పులో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కేలరీలు ఎక్కువ. ప్రోటీన్లు, ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అయితే జీడిపప్పు తీసుకునే పరిమాణం బట్టి, తీసుకునే విధానం బట్టి బరువు పెరిగేలాగా, తగ్గేలాగ కూడా చేస్తుంది.

బరువు పెరగాలంటే..

బరువు పెరగాలని అనుకునే వారు జీడిపప్పును నేరుగా కంటే వేయించి ఉప్పు జోడించిన జీడిపప్పు తినాలి. ఇలా తింటే ఆకలి, దాహం పెరుగుతాయి. ఇది ఆహారం తీసుకోవడాన్ని ప్రేరేపిస్తుంది. జీడిపప్పులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని రోజులో కొంచెం ఎక్కువగా తిన్నా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మహిళలు క్రమం తప్పకుండా పాలకూర తింటే జరిగేది ఇదే..!


బరువు తగ్గాలంటే..

జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్ గా పనిచేస్తుంది. వీటిని పరిమిత మోతాదులో స్నాక్స్ సమయంలో తీసుకుంటే ఇతర అనారోగ్యకరమైన చిరుతిండ్లు తినకుండా నివారిస్తుంది. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. బరువు తగ్గాలని అనుకునేవారు స్నాక్స్ సమయంలో పరిమిత మోతాదులో జీడిపప్పు తినడం సహాయపడుతుంది.

బరువు తగ్గాలని అనుకునేవారు జీడిపప్పును వేయించి కాకుండా సాధారణంగా లేదంటే రాత్రి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవచ్చు. కానీ వేయించి, ఉప్పు, కారం వంటివి జోడించిన జీడిపప్పును మాత్రం తీసుకోకూడదు. వీటిలో కేలరీలు ఉంటాయి కానీ వేయించిన ప్రక్రియ కారణంగా ఆరోగ్యకరమైన కొవ్వులు తగ్గిపోతాయి. సోడియం కంటేంట్ కూడా బరువు పెరగడానికి దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి..

పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..

Arthritis: ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం చెప్పిన అదిరిపోయే చిట్కా..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 21 , 2024 | 12:08 PM