Health Tips: ఈ 4 అలవాటు చేసుకోండి చాలు.. 45ఏళ్లలోనూ 25 ఏళ్లలా యవ్వనంగా కనిపిస్తారు..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:40 PM
45 ఏళ్ల మహిళలు సాధారణంగా స్కూల్ వయసు పిల్లలతో, ఇంటి బాధ్యతలు, ఉద్యోగాల ఒత్తిడితో బిజీ బిజీగా ఉంటారు. వీటి కారణంగా వారి వయసు మరికాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మహిళలు మాత్రం సంతూర్ మమ్మీ అనిపించుకోవడానికి ఇష్టపడతారు.
వయసు పెరిగినా యంగ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఆడవారిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుంది. 45 ఏళ్ల మహిళలు సాధారణంగా స్కూల్ వయసు పిల్లలతో, ఇంటి బాధ్యతలు, ఉద్యోగాల ఒత్తిడితో బిజీ బిజీగా ఉంటారు. వీటి కారణంగా వారి వయసు మరికాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మహిళలు మాత్రం సంతూర్ మమ్మీ అనిపించుకోవడానికి ఇష్టపడతారు. 45 ఏళ్ల వయసు వచ్చినా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది అసాధ్యం ఏమీ కాదు. కేవలం నాలుగు అలవాట్లు రోజూ పాటిస్తుంటే 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా యవ్వనంగా ఉండవచ్చని అంటున్నారు. ఆ అలవాట్లేమిటో తెలుసుకుంటే..
కాల్షియం లోపం ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయ్.. చెక్ చేసుకోండి..!
ఆహారం..
చాలా ఇళ్లలో గమనిస్తే ఆడవాళ్లు పెద్ద డస్ట్ బిన్ లా ప్రవర్తిస్తుంటారు. ఇంట్లో పిల్లలు తినకపోతేనో, భర్త, అత్తమామలు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని మహిళలు తింటుంటారు. ఆహారం వృదా చేయకూడదనే ఆరాటంతో ఎక్కువగా తినడం లేదా ఆహారాన్ని స్టోర్ చేసి మరుసటి రోజు తినడం చేస్తుంటారు. కానీ ఇలా మిగిలిన ఆహారాన్ని తినడం వల్లే మహిళల ఆరోగ్యం పాడవుతోందట. ప్రతి పూటా తాజా ఆహారం తీసుకుంటూ ఆహారంలో పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్. ఆకుకూరలు వంటివన్నీ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నీరు..
బరువు నియంత్రణలో ఉండాలన్నా, శరీరం హైడ్రేట్ గా ఉండాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా రోజుకు 4 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం. అంతకంటే ఎక్కువ తాగాల్సిన అవసరం లేదు. కానీ 3 నుండి 4 లీటర్ల నీరు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
Vitamin-A: విటమిన్-ఎ లోపిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.. ఓసారి చెక్ చేసుకోండి..!
లంచ్..
ఆహారం తీసుకునే విషయంలో ఆయుర్వేదం ఒక సామెత చెబుతుంది. ఉదయం ఆహారం తీసుకునేటప్పుడు భోగి అంటే విలాసవంతమైన వ్యక్తిలాగా అన్ని పదార్థాలు కడుపు నిండుగా తినవచ్చట. మధ్యాహ్నం ఆహారం యోగి లాగా మితంగా తీసుకోవాలట. అదే రాత్రి పూట ఆహారం తీసుకునేటప్పుడు రోగి లాగా అంటే చాలా తక్కువ మొత్తంలో సులువుగా జీర్ణం అయ్యే ఆహారాలు, పానీయాలు తీసుకోవాలట. ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలట. ఇలా చేస్తే శరరం ఆరోగ్యంగా ఉంటుందట.
వ్యాయామం..
వ్యాయామం ప్రతి ఒక్కరికి అవసరం. కానీ ఇంటి పనులు, ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలలో మునిగిపోయిన మహిళలకు వ్యాయామానికి సరిగా సమయం దొరకదు. మహిళలు ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం అరగంట నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇందులో వాకింగ్, బరువులు ఎత్తడం, సైక్లింగ్, యోగా వంటివి భాగం చేసుకోవచ్చు.
Bra Vs Breast Cancer: బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజాలెంతంటే..!
Papaya: జాగ్రత్త.. బొప్పాయిని ఈ ఆహారాలతో కలిపి అసలు తినకూడదు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 06 , 2024 | 04:40 PM