ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health tips: పైన్ విత్తనాలు ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే ఎన్ని లాభాలంటే..!

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:53 PM

పైన్ చెట్లు హిమాలయ ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ విత్తనాలను ఆహారంలో చేర్చుకుంటే అద్బుతమైన ఫలితాలు ఉంటాయి.

Pine Nuts

డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ డ్రై నట్స్ లో ఒక్కో నట్ ఒక్కో రకమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై నట్స్ లో పైన్ విత్తనాలు చాలా ప్రత్యేకం. హిమాలయ ప్రాంతంలో కనిపించే పైన్ చెట్ల నుండి లభించే ఈ విత్తనాలు పోషకాల గని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పైన్ నట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? ఎలా తీసుకోవాలి? వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే..

Golden Hour: గుండె పోటు తర్వాత గంట సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు ఎందుకు? ఇది ఎందుకు అంత ముఖ్యం?


పోషకాలు..

పైన్ నట్స్ లో విటమిన్-ఎ, ఇ, విటమిన్-బి1, విటమిన్-బి2, విటమిన్-సి, కాపర్, మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.

ప్రయోజనాలు..

  • పైన్ గింజలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నియత్రణలో ఉంటుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

  • పైన్ గింజలలో మంచి మొత్తంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, అవసరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి. బలహీనతను, అలసటను దూరం చేయడంలో సహాయపడతాయి. బలహీనంగా ఉన్నవారు, ఎప్పుడూ నీరసంగా అనిపిస్తుందని కంప్లైంట్ చేసేవారు పైన్ విత్తనాలు తింటే మంచిది.

  • పైన్ గింజలలో పినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆకిలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో శక్తిని పెంచడం ద్వారా బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

  • పైన్ నట్స్ లో విటమిన్-ఇ, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్డీమర్స్ డిమెన్షియా వంటి వ్యాధ్యులను నివారించడంలో సహాయపడతాయి.

  • పైన్ నట్స్ లో విటమిన్-ఇ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మెరిచేలా చేస్తాయి.వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

  • జింక్, విటమిన్-బి కాంప్లెక్స్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల పైన్ గింజలు తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది.

శరీరంలో ప్రోటీన్ తగ్గిందో లేదో తెలుసుకోవడం ఎలా? ఈ లక్షణాలతో చెక్ చేసుకోండి..!


ఎలా తినాలి?

పైన్ గింజలను అనేక రకాలుగా తినవచ్చు. వీటిని తేలికగా వేయించి తింటారు. వేయించడం వల్ల వీటి రుచి మెరుగవుతుంది. కానీ అధికంగా వేయిస్తే వీటిలో పోషకాలు నాశనం అవుతాయి. ఈ గింజలను సలాడ్ లు, స్మూతీస్, ఓట్ మీల్ లో కూడా యాడ్ చేసుకుంటారు. దీన్ని స్వీట్లు, కేక్ లలో ఉపయోగిస్తారు. వీటిని గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసి వంటలలో కూడా ఉపయోగిస్తారు.

ఎప్పుడు తినాలి?

పైన్ గింజలను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కానీ ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి మంచిది. అల్పాహారంల వీటిని తీసుకుంటే రోజంతా శక్తి లభిస్తుంది. ఆకలిగా అనిపించినప్పుడు స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. రోజూ 15 నుండి 20 గ్రాముల పైన్ గింజలు తినవచ్చు. ఇవి దాదాపు పిడికిలికి సమానం. అంతకు మించి ఎక్కువగా తింటే శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మాత్రం పైన్ గింజలను వైద్యుల సలహాతో తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి..

కీర దోసకాయ, టమాటో.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..!

ఖాళీ కడుపుతో ఉదయాన్నే పసుపు నీటిని రోజూ తాగితే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 30 , 2024 | 01:53 PM