ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Health Tips: ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే అందం, ఆరోగ్యం పెరుగుతుంది..

ABN, Publish Date - Mar 03 , 2024 | 10:03 AM

Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదే సమయంలో అందంగానూ ఉండాలని భావిస్తారు. కానీ.. సరికాని జీవనశైలి(Lifestyle) కారణంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి మంచి ఆరోగ్యం(Health), మంచి ముఖారవిందం(Beauty Face) కావాలంటే.. ప్రతి రోజూ ఉదయం కొన్ని చర్యలు పాటించాలని, అది పెద్ద కష్టమైన పని కూడా కాదని నిపుణులు చెబుతున్నారు.

Health News

Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అదే సమయంలో అందంగానూ ఉండాలని భావిస్తారు. కానీ.. సరికాని జీవనశైలి(Lifestyle) కారణంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మరి మంచి ఆరోగ్యం(Health), మంచి ముఖారవిందం(Beauty Face) కావాలంటే.. ప్రతి రోజూ ఉదయం కొన్ని చర్యలు పాటించాలని, అది పెద్ద కష్టమైన పని కూడా కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే కాంతివంతమైన ముఖంతో పాటు.. బరువు కూడా నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే నిద్రలేచిన తరువాత నీరు తాగాలి. ఆ తరువాత కొన్ని డ్రింక్స్ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మిల్క్ టీకి బదులుగా గ్రీన్ టీ..

చాలా మంది ఉదయాన్నే పాలతో తయారు చేసిన టీ తాగుతారు. అయితే, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన చర్మం కావాలనుకుంటే మాత్రం ఈ మిల్క్ టీని మానేయాలి. దాని బదులుగా గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. ఇది జీవక్రియను సక్రియం చేస్తుంది. చర్మంపై ముడతలు, డల్‌నెస్ వంటి వృద్దాప్య సంకేతాలను తొలగిస్తుంది. చర్మం మెరుస్తుంది.

దోసకాయ, నిమ్మకాయతో చేసిన డిటాక్స్ డ్రింక్..

ఉదయం దినచర్యలో దోసకాయ, నిమ్మకాయతో చేసిన డ్రింక్‌ను తాగండి. మార్చి నుండి వాతావరణం మరింత వేడెక్కుతుంది. ఈ డ్రింక్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాకుండా లోపల నుండి హైడ్రేట్‌గా ఉంచుతుంది. దీని వల్ల డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ సమస్య తగ్గుతుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

జీలకర్ర వాటర్ తాగాలి..

ఉదయాన్నే జీలకర్ర మరిగించిన నీటిని తాగితే మేలు జరుగుతుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. జీవక్రియను కూడా పెంచుతుంది. పెరుగుతున్న బరువును అదుపులో ఉంచుతుంది. అలాగే చర్మంపై మచ్చలు, మొటిమల సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. అయితే, ఈ జీలకర్ర వాటర్‌ను పరిమితంగానే తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 03 , 2024 | 10:03 AM

Advertising
Advertising