ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: పండుగ ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే ఈ నీరు తాగండి..

ABN, Publish Date - Oct 30 , 2024 | 01:20 PM

పండుగకు ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలన్నా, పండుగ రోజుల్లో ఆహారాన్ని ఎంజాయ్ చేయాలన్నా ఈ ఒక్క డ్రింక్ తాగాలి.

పండుగ కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు.. రుచికరమైన వంటకాలను కూడా అందిస్తుంది. ప్రతి ఇంట్లో వారి స్థోమతకు తగ్గట్టు పండుగ వంట చేసుకుంటారు. ముఖ్యంగా పండుగ అంటే తీపి పదార్థాలు, నూనెలో వేయించి చేసే పదార్థాలు, చక్కెర, నెయ్యి పుష్కలంగా జోడించిన పదార్థాలు అధికంగా ఉంటాయి. సాధారణంగా ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకునే వారు కూడా పండుగ దగ్గర కండీషన్స్ అన్నీ పక్కన పెట్టి మరీ ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ఇలా ఆహారాలు అన్నీ ఒక్కసారిగా తీసుకోవడం వల్ల చాలామంది కడుపు డిస్టర్బ్ అవుతుంది. కొందరు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురు కాకూడదు అంటే పండుగకు ముందే వాము గింజల నీరు తాగాలట.

Diabetes: జస్ట్.. రోజూ ఒక్క గ్లాస్ దీన్ని తాగారంటే చాలు.. దెబ్బకు షుగర్ సమస్య తోక ముడుస్తుంది..


పండుగకు ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే.. ఉదయాన్నే కాఫీ, టీ లకు బదులు వాము గింజల నీరు తాగాలని వైద్యులు అంటున్నారు. వీటికి బదులుగా పండుగకు రెండు రోజుల ముందు కాఫీ, టీలు బంద్ చేసి వాము గింజల నీరు తాగితే పొట్ట శుభ్రపడుతుంది. రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వాము గింజలు వేయాలి. రాత్రంతా దీన్ని నానబెట్టాలి. ఉదయాన్నే వాము గింజలు బాగా కలిపి.. స్టౌ మీద కొద్దిగా వేడి చేసి వడగట్టి గోరు వెచ్చగా తాగాలి. వాము నీరు తాగిన తరువాత సుమారు 30 నిమిషాలు మరింకే పదార్థాలు తినడం లేదా తాగడం వంటివి చేయకూడదు. ఇది చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

Health Tips: వంటింట్లో ఉండే ఈ నేచురల్ పెయిన్ కిల్లర్స్ గురించి తెలుసా..!


వాము గింజల నీరు తాగితే..

  • వాము గింజల నీరు తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. వాము నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • గ్యాస్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు పండుగ ముందు రోజుల్లో ఖచ్చితంగా వాము నీరు తాగమని ఆహార నిపుణులు సలహా ఇస్తున్నారు. వాములో ఉండే సమ్మేళనాలు జీర్ణవ్యవస్థను పటిష్టం చేస్తాయి. మలబద్దకాన్ని దూరం చేస్తాయి.

  • అసలే చలిగాలుల కాలం, మరొకవైపు వర్షాలు కూడా ఉంటున్నాయి. వీటికి పండుగ వంటలు తోడైతే ఆస్తమా రోగులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాము గింజల నీరు తాగితే శ్వాస, గొంతు సమస్యలు, ముక్కు సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం ఉంటుంది. వాము గింజలు వేడి గుణం కలిగి ఉంటాయి. ఇవి ఆస్తమా రోగులకు ఔషధంలా పని చేస్తాయి.

ఇవి కూడా చదవండి..

World Stroke Day: స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే.. ఇలా చేయండి..!

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 30 , 2024 | 01:20 PM