ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: బాబోయ్.. రాగులు మంచి పోషకాహారమే అనుకున్నాం.. కానీ దీంతో ఈ లాభాలు కూడా ఉన్నాయా..

ABN, Publish Date - Nov 08 , 2024 | 05:18 PM

రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, రాగులలో బోలెడు పోషకాలు ఉంటాయని తెలుసు. కానీ చాలామందికి ఈ నిజాలు తెలియవు.

Finger Millet

రాగులు చాలా పోషకమైన చిరు ధాన్యం. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు.. ఎంతో చిన్నగా ఉండే ఈ రాగులను ఆహారంలో తీసుకుంటే లెక్కలేనన్ని లాభాలు సొంతమవుతాయి. రాగులను పిండి పట్టించి వివిధ రకాల వంటకాలు చేసుకుంటారు. వీటిలో రాగి అంబలి, రాగి సంగటి, రాగి రొట్టె, రాగి మాల్ట్ మొదలైనవి చాలా ప్రాచుర్యం పొందాయి. అయితే రాగులు రుచిని, పోషకాలను కలిగి ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ రాగుల గురించి చాలామందికి తెలియని నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

Skin Care: మెరిసే చర్మం కోసం ఫేస్ క్రీములు అక్కర్లేదు.. నీళ్లు ఇలా తాగి చూడండి..


రాగులలో పోషకాలు..

రాగులలో కాల్షియం, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీన్ని ప్రతి రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే ఈ కింది లాభాలు సొంతమవుతాయి.

ప్రయోజనాలు..

  • రాగులను అధికంగా పిండి రూపంలో తీసుకుంటారు. రాగుల పిండిని రొట్టెలు, రాగి సంగటి, రాగి అంబలి, రాగి మాల్ట్, రాగి ఇడ్లీ, రాగి దోశ.. ఇలా చాలా రకాలుగా తీసుకుంటారు. అయితే రాగులను ఏదో ఒక ఆహార రూపంలో భాగం చేసుకుంటే శరీరంలో కాల్షియం లోపం తగ్గుతుంది. ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. బోలు ఎముకల వ్యాధి రాకుండా చేస్తుంది.

  • మధమేహ రోగులకు రాగులు వరం కంటే తక్కువ కాదు. రాగులను ఆహరంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రాగులలో అధికంగా పాలీ ఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజులో టిఫిన్, లంచ్, డిన్నర్ లో ఏదో ఒక రూపంలో తీసుకుంటే రక్తంలో చక్కెరలు అదుపులో ఉంటాయి.

  • చాలామందికి తెలియని షాకింగ్ నిజం ఏంటంటే.. రాగులు మానసిక ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆందోళన, నిరాశ, నిద్రలేమి వంటి ససమస్యలతో ఇబ్బంది పడేవారికి రాగులు బాగా సహాయపడతాయి.

Custard Apple: సీతాఫలాల కాలం.. ఆరోగ్యానికి భలే లాభం..


  • బరువు తగ్గాలని అనుకునే రాగులను ఆహారంలో ప్రధానంగా తీసుకుంటూ ఉంటే తొందరగా బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువ. ఎక్కువసేపు ఆకలిని నియంత్రణంలో ఉంచుతుంది. అతిగా తినకుండా శరీరంలోకి కేలరీలు ఎక్కువ వెళ్లకుండా చేస్తుంది. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

  • ఐరన్ పుష్కలంగా లభించే ధాన్యం రాగులు. రాగులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తహీనత సమస్య చాలా తొందరగా నయమవుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు రాగులను తింటూ ఉంటే ఇందులో ఉండే ఐరన్ తేలికగా జీర్ణమై రక్తంలో తేలికగా కరుగుతుంది.

ఇవి కూడా చదవండి..

Coper Bottles: రాగి వాటర్ బాటిల్స్ వాడుతుంటారా.. వాటిని ఇలా ఈజీగా క్లీన్ చేసుకోండి..

Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా.. వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 08 , 2024 | 05:18 PM