Health Tips: వంటింట్లో ఉండే ఈ నేచురల్ పెయిన్ కిల్లర్స్ గురించి తెలుసా..!
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:36 PM
చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య రాగానే పెయిన్ కిల్లర్ లు వాడుతుంటారు. కానీ వాటికి బదులు వంటింట్లో ఉండే ఈ పెయిన్ కిల్లర్లు వాడితే చాలా మంచిది.
పెయిన్ కిల్లర్స్ చాలామంది జీవితంలో భాగం. ఒంట్లో ఏమాత్రం బాగోలేకపోయినా మొదటగా అందరూ చేసేది పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకోవడమే. అవి వాడినా కూడా ఆరోగ్యం బాగవ్వకపోతే అప్పుడు మాత్రమే డాక్టర్ ను కలుస్తారు. అయితే చీటికి మాటికి పెయిన్ కిల్లర్లు వాడొద్దని స్వయంగా డాక్టర్లే చెబుతుంటారు. అందులోనూ సొంత వైద్యం పనికిరాదని, ఎవరికి వారు మెడికల్ స్టోర్ లో పెయిన్ కిల్లర్లు తెచ్చుకుని వాడటం మంచిది కాదని కూడా చెబుతుంటారు. వీటి వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినా శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనం అవుతుంది. అయితే సాధారణ ఆరోగ్య సమస్యలకు వంటింట్లో ఉండే కొన్ని వస్తువులు నేచురల్ పెయిన్ కిల్లర్స్ లా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుంటే..
World Stroke Day: స్ట్రోక్ ప్రమాదం తగ్గాలంటే.. ఇలా చేయండి..!
వంటింట్లో ఉండే మసాలా దినుసులు అయిన లవంగాలు, జాపత్రి, యాలకులు, జాజికాయ, మిరియాలు, షాజీరా.. ఇలా ఎన్నో రకాల మసాలా దినుసులు వంటలకే కాదు.. ఆరోగ్యానికి కూడా గొప్ప ఔషధంలా పని చేస్తాయి. వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసులు సహజ నొప్పి నివారిణులుగా పనిచేస్తాయి.
లవంగాలు..
వంటింటి మసాలా దినుసులలో లవంగాలు చాలా కీలకమైనవి. లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. తలనొప్పి, ఆర్థరైటిస్ వంటి నొప్పులతో ఇబ్బంది పడేవారు లవంగాలను తీసుకుంటే అవి సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తాయి.
పసుపు..
నొప్పులు, వాపులు తగ్గించడంలో పసుపు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపును పాలలో కలుపుకుని తాగుతూ ఉంటే వాపులు, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
అల్లం..
వంటల్లో ఎక్కువగా వినియోగించే అల్లం గొప్ప నొప్పి నివారిణి. ఇందులో ఉండే యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. అల్లాన్ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఖర్జూరం తినే చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే..
మిరియాలు..
మిరియాలు పరిమాణంలో చిన్నవే అయినా వీటి ఔషద గుణాలు చాలా గొప్పవి. మిరియాలలో ఉంటే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. మిరియాలను వంటల్లోనే కాకుండా టీ, పాలు, కషాయం వంటి వాటిలో జోడించుకుని తీసుకోవచ్చు. లేదంటే మిరియాల పొడిని పలు ఆహారాల మీద చల్లుకుని తినవచ్చు.
దాల్చిన చెక్క..
దాల్చిన చెక్క వంటింట్లో ఉండే బెస్ట్ పెయిన్ కిల్లర్. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారికి దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే రసాయన సమ్మేళనాలు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. అయితే సాధారణ దాల్చిన చెక్క కంటే శ్రీలంక దాల్చిన చెక్క ప్రభావవంతంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 29 , 2024 | 03:36 PM