Health Tips: క్రమం తప్పకుండా 2వారాల పాటూ కొబ్బరి నీరు లేదా నిమ్మకాయ నీరు తాగితే ఏం జరుగుతుంది?
ABN, Publish Date - Sep 03 , 2024 | 12:14 PM
ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పానీయాలు కూడా శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తాయి. ఇలాంటి వాటిలో కొబ్బరి నీరు, నిమ్మరసం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. క్రమం తప్పకుండా 2 వారాల పాటూ వీటిలో ఏ ఒక్కటి తాగినా..
ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు ఉన్న ఆహారం బాగా తీసుకోవాలి. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన పానీయాలు కూడా శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తాయి. ఇలాంటి వాటిలో కొబ్బరి నీరు, నిమ్మరసం ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటాయి. ఎండకు అలసినప్పుడు ఈ రెండింటిలో ఏ ఒక్కటి తీసుకున్నా శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది. అయితే కొబ్బరి నీరు లేదా నిమ్మరసం నీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా రెండు వారాల పాటూ తాగడం వల్ల శరీరంలో ఊహించని మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేవలం ఇవి రెండు మాత్రమే కాదు.. అల్లం రసం కూడా తీసుకోవచ్చు. ఇంతకీ ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే..
Shampoo: షాంపూ కూడా విషంలా ప్రభావం చూపిస్తుందా? ఈ నిజాలు తెలిస్తే..!
2 వారాల పాటు రోజూ కొబ్బరి నీళ్లను తాగితే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందని, ఉబ్బరం సమస్య దూరమవుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ 2 వారాల పాటు నిమ్మరసం తాగితే, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
అల్లం రసం తీసుకోవడాన్ని అల్లం షాట్ అని అంటారు. అంటే ఒక స్పూన్ మొత్తంలో అల్లం రసాన్ని తాగుతారు. అల్లం రసం ప్రతిరోజూ తాగితే చర్మాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ముఖం పై కనిపించే మొటిమలు, మచ్చలను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
Vitamin B12: మీరు శాకాహారులా? విటమిన్-బి12 కోసం ఇవి తినండి చాలు..!
కేవలం కొబ్బరి నీరు, నిమ్మరసం నీరు, అల్లం రసం తీసుకుంటేనే కాదు.. రెండు వారాల పాటూ క్రమం తప్పకుండా ఆయిల్ పుల్లింగ్ చేసినా చాలా ప్రయోజనాలు ఉంటాయి.
ఉదయాన్నే బ్రష్ చేయకముందే కొద్దిగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను నోట్లో వేసుకుని సుమారు 10-30 నిమిషాల పాటూ ఆయిల్ పుల్లింగ్ చేయాలి. రోజూ ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. శరీర మెటబాలిజం బలపడుతుంది. ముందుకంటే ఎక్కువగా శరీరం శక్తివంతంగా అనిపిస్తుంది. దంతక్షయం సమస్య ఎప్పుడూ ఉండదు. ఈ ఆయిల్ పుల్లింగ్ ను ఎక్కువగా దంత సమస్యలు తొలగించేందుకు చేస్తారు.
ఇవి కూడా చదవండి..
బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..!
ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!
బృందావనం గురించి ఈ రహస్యాలు తెలుసా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 03 , 2024 | 12:14 PM