Health Tips: రోజూ ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా?
ABN, Publish Date - Oct 11 , 2024 | 06:16 PM
ఆరెంజ్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదే.. కానీ రోజూ ఉదయాన్నే తాగితే జిరిగేది ఇదే..
రోజులో ఉదయాన్నే తీసుకునే ఆహారం కానీ, పానీయం కానీ శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చాలామంది రోజంతా ఉత్సాహంగా ఉండటం కోసం శక్తివంతమైన ఆహారాలు, పానీయాలు ఉదయాన్నే తీసుకుంటారు. ఆ కోవలోకి చెందినదే ఆరెంజ్ జ్యూస్ కూడా. ప్రతి రోజూ ఉదయాన్నే తాజా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
బరువు..
బరువు తగ్గే ఆలోచనలో ఉన్నవారు, బరువు తగ్గాలని ప్రయత్నాలు చేస్తున్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు తాజా ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు జీవక్రియను సక్రమంగా ఉంటుంది. ఇందులో చక్కెరలు కానీ కొవ్వు కానీ ఉండవు కాబట్టి ఇది చక్కెర పానీయాలు, శీతల పానీయాల కంటే చాలా మంచి ఎంపిక.
Skin Care: కళ్ల కింద చర్మం ముడతలు పడిందా? ఈ ఐ ప్యాక్ ట్రై చేయండి..!
రోగనిరోధక శక్తి..
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, విటమిన్ డి, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడం ద్వారా శరీరం ఇన్‌ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతాయి. రోజూ గ్లాసుడు తాజా ఆరెంజ్ జ్యూస్ తాగితే సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం..
తాజా ఆరెంజ్ జ్యూస్ న ఉదయాన్నేతీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. శీరరంలో ఉనన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నారింజ రసం ఒక వ్యక్తి రోజువారీ పొటాషియం అవసరాలలో 14 శాతాన్ని అందిస్తుంది. పొటాషియం తీసుకోవడం వల్ల స్ట్రోక్ తో పాటు ఇతర గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
Hair Care: జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!
చర్మం..
నారింజ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని అకాల వృద్ధాప్యం నుండి రక్షిస్తుంది. వాతావరణం కారణంగా చర్మం డ్యామేజ్ అవ్వడాన్ని కూడా నివారిస్తుంది. స్కిన్ టోన్, నల్ల మచ్చలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. విటమిన్ సి కొల్లాజెన్ సంశ్లేషణను పెంచుతుంది కాబట్టి చర్మం మృదువుగా మారుతుంది. చర్మం మీద గీతలు, ముడతలు తగుతాయి.
అభిజ్ఞా ఆరోగ్యం..
ఒక గ్లాసు తాజా నారింజ రసం మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి మంటను తగ్గిస్తాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇవి కూడా చదవండి..
ackfruit: పనసపండును ఇష్టంగా తినేవారు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!
Phool Makhana: మగవాళ్లకు ఫూల్ మఖానా చేసే మేలెంత? మీకు తెలియని నిజాలివి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 11 , 2024 | 06:16 PM