Health tips: బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివీ..!
ABN, Publish Date - Sep 18 , 2024 | 10:46 AM
చాలామంది అల్పాహారం విషయంలో తప్పులు చేస్తుంటారు. వివిధ కారణాల వల్ల అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. అసలు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే జరిగేదేంటి?
ఆహారం ప్రతి ప్రాణికి ఎంతో అవసరం. రోజూ మూడు పూటలా విధిగా ఆహారం తీసుకోవడం అందరికీ అలవాటు. రోజులో ఏదైనా ఒక పూట ఆహారం తీసుకోకపోతే అది శరీరానికి అంత తొందరగా ఎలాంటి ప్రభావం కనిపించకపోవచ్చు కానీ దీర్ఘకాలం ఇలాంటివి కొనసాగితే మాత్రం శరీరం మీద చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చాలామంది అల్పాహారం విషయంలో తప్పులు చేస్తుంటారు. వివిధ కారణాల వల్ల అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. అసలు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే జరిగేదేంటి? ఆహార నిపుణులు చెబుతున్న విషయాలు తెలుసుకుంటే..
గుడ్లు, చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారం గురించి తెలుసా?
బరువు..
చాలామంది బరువు తగ్గాలనే కారణంతో ఉదయాన్నే అల్పాహారం స్కిప్ చేస్తుంటారు. కానీ అల్పాహారం స్కిప్ చేయడం వల్ల బరువు తగ్గకపోగా బరువు పెరుగుతారు. రాత్రి భోజనం తరువాత సుమారు 8 నుండి 10 గంటలకు పైగా శరీరానికి ఆహారం అందదు. ఈ కారణంగా శరీరానికి ఆహారం అవసరం అవుతుంది. ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేయడం వల్ల భోజనం సమయానికి ఆకలి మరింత ఎక్కువ అవుతుంది. భోజనంలో ఆహారం చాలా ఎక్కువ తింటారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.
టైప్-2 డయాబెటిస్..
ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మానేయడం వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి గ్లూకోజ్ అందదు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఆ తరువాత భోజనం అధికంగా తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులకు కారణం అవుతాయి. ఇది టైప్-2 డయాబెటిస్ కు కారణం అవుతుంది.
నానబెట్టిన ఎండుద్రాక్షను నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
మానసిక ఆరోగ్యం..
అల్పాహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిపుణులు చెబుతున్న విషయాల ప్రకారం న్యూరోట్రాన్స్మిటర్ అయిన సెరోటోనిన్ అల్పాహారం తీసుకున్నప్పుడు విడుదల అవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
చిరాకు..
అల్పాహారం మానేయడం వల్ల శరీరానికి సెరటనిన్ స్థాయి మందగిస్తుంది. సెరోటోనిన్ తక్కువగా ఉండటం వల్ల చిరాకు, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఇది మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.
గుండె జబ్బులు..
ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోకపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రోజుకొక యాపిల్ ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
రక్తపోటు..
ఉదయం అల్పాహారం తీసుకోకపోతే గుండె ఆరోగ్యం మీద ప్రభావం పడటమే కాదు.. రక్తపోటు కూడా దెబ్బ తింటుంది. ఇది రక్తపోటు పెరగడానికి కారణం అవుతుంది.
పోషకాల లోపం..
ఉదయాన్నే అల్పాహారం తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. కానీ అల్పాహారం స్కిప్ చేస్తే శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, పైబర్ వంటి పోషకాలు అందవు. తద్వారా పోషకాల లోపం ఏర్పడుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ తింటే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. ఈ నష్టాలు కూడా ఉంటాయి..!
తేనెలో నానబెట్టిన వెల్లుల్లి తింటే జరిగేది ఇదే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Sep 18 , 2024 | 10:46 AM