Health Tips: రాత్రి భోజనం తరువాత వాకింగ్ చేయడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలివీ..!
ABN, Publish Date - Jun 19 , 2024 | 03:33 PM
వాకింగ్ ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చెయ్యడం చాలామంది అలవాటు. అయితే కొందరు రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి కొందరు హేళన చేస్తుంటారు కూడా. అయితే రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం గురించి వైద్యులు కొన్ని నిజాలు బయటపెట్టారు.
వాకింగ్ ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం. రోజూ ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చెయ్యడం చాలామంది అలవాటు. అయితే కొందరు రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారిని చూసి కొందరు హేళన చేస్తుంటారు కూడా. అయితే రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి లాభాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..
రాత్రి భోజనం చేసిన తరువాత నడిస్తే అది జీవక్రియకు తోడ్పడుతుందట. ఆహారం బాగా జీర్ణం కావడానికి ఇది కీలకం. కడుపు ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి భోజనం చేసిన తరువాత కొద్దిసేపు వాకింగ్ చేయడం ఉత్తమం.
పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!
రాత్రి భోజనం చేసిన తరువాత గంటలు గంటలు నడవక్కర్లేదు. కేవలం 10 నుండి 20 నిమిషాలు నడిస్తే చాలు.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా భోజనం తరువాత ఇలా చేయడం వల్ల మధుమేహం సమస్యను దూరంగా ఉంచవచ్చు.
అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారికి రాత్రి భోజనం తరువాత నడవడం చాలా మంచిది. రాత్రి తిన్న వెంటనే కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి చేయడం వల్ల బరువు మీద చాలా ప్రభావం ఉంటుంది. దానికి బదులుగా తిన్న వెంటనే కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణాశయంలోని పేగులు సడలించడబడతాయి. ఇది ఆహారం బాగా జీర్ణమవటానికి, కేలరీలు బర్న్ కావడానికి సహాయపడుతుంది.
రాత్రి భోజనం తరువాత కొద్దిసేపు నడిస్తే కడుపు తేలికగా మారుతుంది. శరీరానికి కాస్త శ్రమ కలగడం వల్ల రాత్రి హాయిగా నిద్ర పడుతుంది.
రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
నడవడం అనేది శరీరంలో ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది. ఎండార్ఫిన్లు మూడ్ లిఫ్టర్లుగా పనిచేస్తాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. అందుకే రాత్రిపూట కాసేపు నడిస్తే ప్రశాంతంగా ఎలాంటి గందరగోళం లేకుండా నిద్రపోవచ్చు.
రాత్రి భోజనం తరువాత నడవడం వల్ల కాళ్లు మంచి ఆకృతిలోకి మారడమే కాకుండా కాళ్ల కండరాలు బలోపేతం అవుతాయి. కాళ్లు ఫిట్ గా మారతాయి.
వాకింగ్ అనేది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తరువాత నడిస్తే రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!
రక్తాన్ని శుద్ది చేసే సూపర్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jun 19 , 2024 | 03:33 PM