Health Tips: రాత్రి సమయంలో భోజనం స్కిప్ చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..
ABN, Publish Date - Oct 26 , 2024 | 05:21 PM
రాత్రి నిద్రపోవడం తప్ప చేసే పనులేవి లేవు కదా భోజనం చేయకపోయినా ఏం కాదులే అని చాలామంది అనుకుంటారు. కానీ రాత్రి ఆహారం స్కిప్ చేస్తే జరిగేది ఇదే..
రాత్రి భోజనం జీవనశైలిలో ప్రధానం. రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడంలో రాత్రి భోజనం కీలకంగా ఉంటుంది. అయితే చాలామంది రాత్రి భోజనం స్కిప్ చేస్తుంటారు. రాత్రి సమయంలో పడుకోవడమే తప్ప చేసే పని ఏమీ ఉండదు కాబట్టి భోజనం చేయకపోయినా పర్వాలేదని అనుకుంటారు. కొంతమంది రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే రాత్రి భోజనం గురించి ఆహార నిపుణులు కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. వాటి గురించి తెలుసుకుంటే..
Life Lesson: కెరీర్ లో విజయం సాధించాలంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోవాలి..!
శక్తి..
రాత్రి సమయంలో ఆహారం మానేస్తే శరీరంలో శక్తి స్థాయిలు దారుణంగా తగ్గుతాయి. ఈ కారణంగా మరుసటి రోజు ఉదయం లేవగానే చాలా నీరసంగా ఉంటారు. ఇది రోజంతా చేయవలసిన కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తుంది.
నిద్ర..
రాత్రి భోజనం మానేస్తే సరిగా నిద్రపోలేరని వైద్యులు అంటున్నారు. మంచి నిద్రకు శరీరానికి శక్తి అవసరం అవుతుంది. రాత్రి సమయంలో ఆకలివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల నిద్రకు ఆటంకం కూడా ఏర్పడుతుంది. రాత్రి పూట ఆహారం, నిద్ర సరిగా లేకపోవడం వల్ల మరుసటి రోజు బద్దకం, నీరసం, చిరాకు వంటి సమస్యలు వస్తాయి.
ఈ టిప్స్ పాటిస్తే.. ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీ..
బరువు..
చాలామంది రాత్రి సమయంలో ఆహారం తినకపోతే బరువు తగ్గుతాం అనుకుంటారు. కానీ దీని వల్ల బరువు పెరుగుతారు. రాత్రంతా ఆహారం లేకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఆకలి కూడా ఎక్కువగా వేస్తుంది. ఈ కారణంగా ఆహారం ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. అంతే కాదు ఇది జీర్ణక్రియను నెమ్మదించడం వల్ల అప్పటికే బరువు తగ్గే ప్రయత్నాలలో ఉన్నవారికి ఆ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు..
ఖాళీ కడుపుతో నిద్ర పోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎక్కువ సేపు ఆకలితో ఉన్నప్పుడు శరీరంలో యాసిడ్ స్థాయి పెరుగుతుంది. ఇది ఎసిడిటీ, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Diabetes: పండుగల సమయంలో షుగర్ పెరగకూడదంటే డయాబెటిస్ ఉన్నవారు ఇలా చేయాలి..
Black Tea: బ్లాక్ టీ.. ఇలా తాగితే ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగిపోద్ది..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 26 , 2024 | 05:21 PM