ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: కాళ్లు చేతులలో జలదరింపు వస్తుందా? అసలు కారణం ఇదే..!

ABN, Publish Date - Sep 10 , 2024 | 11:20 AM

సాధారణంగా పడుకున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఇతర సమయాల్లో ఉన్నట్టుండి కొందరికి కాళ్లు, చేతులు జలదరిస్తుంటాయి. మరికొందరికి కాళ్లు చేతుల మీద చీమలు పాకినట్టు, చీమలు కుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది.

ఈ కాలంలో అనారోగ్యం బారిన పడని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి జబ్బులు లేకపోయినా కనీసం బీపీ, షుగర్ తో అయినా ఇబ్బంది పడేవారు ఉంటారు. అయితే చాలామందికి తమకు కొన్ని రకాల జబ్బులు ఉన్నట్టు తెలియను కూడా తెలియదు. వాటి గురించి అవగాహన లేకపోవడమే కారణం. సాధారణంగా పడుకున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఇతర సమయాల్లో ఉన్నట్టుండి కొందరికి కాళ్లు, చేతులు జలదరిస్తుంటాయి. మరికొందరికి కాళ్లు చేతుల మీద చీమలు పాకినట్టు, చీమలు కుట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుందో చాలామందికి తెలియదు. దీని వెనుక కారణాలను వైద్యులు వివరించారు. అవేంటో తెలుసుకుంటే..

ఏడాదికి ఒకసారి ఈ 6 రకాల రక్త పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యం సేఫ్..!


విటమిన్-బి12..

శరీరానికి విటమిన్-బి12 చాలా అవసరం. విటమిన్-బి12 లోపం వల్ల కాళ్లు చేతులలో జలదరింపు వస్తుంది. విటమిన్-బి12 శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరుకు సహకరిస్తుంది. కానీ విటమిన్-బి12 లోపించడం వల్ల నరాల పనితీరు మందగిస్తుంది. శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్, పోషకాలు సరఫరా కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ కారణంగానే శరీరంలో కాళ్లు, చేతులలో జలదరింపు ఏర్పడుతుంది. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే క్రమంగా కాళ్లు చేతులు మొద్దుబారి పోతాయి. అందుకే విటమిన్-బి12 ఉన్న ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.

విటమిన్-బి12 చాలావరకు మాంసాహారంలో మాత్రమే ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ విటమిన్-బి12 మాంసాహారంలో మాత్రమే కాకుండా శాకాహారంలో కూడా లభ్యమవుతుంది. మాంసాహారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? శాకాహారులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకుంటే..

బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!


మాంసాహారులు..

విటమిన్-బి12 చేపలలో పుష్కలంగా లభిస్తుంది. ఒక కప్పు లేదా 150 గ్రాముల సార్టినెస్ చేపలో 55 శాతం వరకు విటమిన్-బి12 ఉంటుంది.

గుడ్లలో కూడా విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా గుడ్డులో ఉండే పచ్చసొనలో విటమిన్-బి12 ఉంటుంది. కేవలం విటమిన్-బి12 మాత్రమే కాకుండా విటమిన్-బి2 కూడా గుడ్లలో ఉంటుంది.

మాంసాహారులు విటమిన్-బి12 కోసం చికెన్ కూడా తినవచ్చు. 75గ్రాముల చికెన్ నుండి 0.3మైక్రో గ్రాముల విటమిన్-బి12 శరీరానికి అందుతుంది.


రోజూ సలాడ్ తింటూంటే శరీరంలో జరిగే మార్పులివే..!



శాకాహారులు..

శాకాహారులు విటమిన్-బి12 కోసం పాలు తీసుకోవచ్చు. పాల ద్వారా విటమిన్-బి12 మాత్రమే కాకుండా కాల్షియం, ప్రోటీన్, విటమిన్-డి కూడా లభిస్తాయి.

తృణధాన్యాలు విటమిన్-బి12 కు మంచి మూలం. కేవలం తృణధాన్యాలు మాత్రమే కాకుండా ఫోర్టిఫైడ్ ఫుడ్స్ కూడా విటమిన్-బి12 ను అందిస్తాయి.

పాల ఆధారిత ఆహారం అయిన పెరుగులో కూడా మంచి మొత్తంలో విటమిన్-బి12 ఉంటుంది. అలాగే విటమిన్-డి తో పాటు ప్రో బయోటిక్స్ కూడా పెరుగు వల్ల లభిస్తాయి.

ఇది కూడా చదవండి..


Packet Milk: ప్యాకెట్ పాలు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?


Vitamin-D: విటమిన్-డి పుష్కలంగా లభించాలంటే.. సూర్యకాంతిలో ఏ సమయంలో గడపాలంటే..!


White Hair: హెయిర్ డై బదులు ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ వేసుకోండి.. జుట్టు నల్లగా మారుతుంది..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 10 , 2024 | 11:20 AM

Advertising
Advertising