ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:44 PM

కొలెస్ట్రాల్ ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది.

Cholesterol

కొలెస్ట్రాల్ శరీరంలో అన్ని కణాలలో ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లు, విటమిన్-డి తయారీకే కాకుండా ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన మూలకాల తయారీకి కూడా అవసరం అవుతుంది. కొలెస్ట్రాల్ లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉన్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెకు, మెదడుకు రక్తం సరఫరా కావడంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇది స్ట్రోక్ కు కారణం అవుతుంది.

ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఏం జరుగుతుందంటే..


శరీరంలో అదిక కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది..

  • చెడు కొలెస్ట్రాల్‌కు అనారోగ్యకరమైన ఆహారం ప్రధాన కారణం. . ఆహారంలో అధిక సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్ కొవ్వుల కారణంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సంతృప్త కొవ్వు ఎర్ర మాంసం, వెన్న, పూర్తి కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులలో కనిపిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ కనిపిస్తుంది.

  • అధిక కొలెస్ట్రాల్‌కు రెండవ అతిపెద్ద కారణం వ్యాయామం లేకపోవడం. ఊబకాయం ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బరువును ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.

  • చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి ధూమపానం మరొక కారణం. ధూమపానం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

  • ఏదైనా జీవనశైలి వ్యాధి లేదా ఆరోగ్య సంబంధిత సమస్య ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదాహరణకు మీకు మధుమేహం, అధిక రక్తపోటు లేదా మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది.

  • శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మరొక కారణం వయస్సు, జెండర్. చెడు కొలెస్ట్రాల్ వయస్సుతో పాటుపెరుగుతుంది. స్త్రీలలో కంటే పురుషులలో చెడు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండవచ్చు.

దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 దేవాలయాలు ఇవి..


కొలెస్ట్రాల్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే..

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తెలుసుకోవడానికి లిపిడ్ ప్రోపైల్ పరీక్షను చేయించుకోవాలి. 9-12 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్షలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ వంటి వివరాలు తెలుస్తాయి.

కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి..

లిపిడ్ పరీక్షలో చెడు కొలెస్ట్రాల్ 100 mg/dl కంటే తక్కువగా ఉండాలి. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ 40mg/dl కంటే తక్కువ ఉండాలి. ట్రైగ్లిజరైడ్లు 150mg/dl కంటే తక్కువ ఉండాలి.

ఇవి కూడా చదవండి..

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

ఆడవాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇవి..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 25 , 2024 | 12:44 PM