మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Healthy Bones: ఎముకలు బలంగా మారాలంటే ఏం తినాలి? ఈ 5 ఆహారాలు తిని చూడండి చాలు..!

ABN, Publish Date - May 07 , 2024 | 01:06 PM

డుస్తున్నప్పుడో, పనిచేస్తున్నప్పుడో కాళ్లు చేతులలో నొప్పులు వస్తుంటాయి. ఇలా నొప్పులు రావడం బలహీనమైన ఎముకలకు సంకేతంగా చెబుతూంటారు. బలహీనమైన ఎముకలు ఉండటం వల్ల కనీసం కూర్చోవడం, లేవడం కూడా కష్టమవుతూ ఉంటుంది.

Healthy Bones: ఎముకలు బలంగా మారాలంటే ఏం తినాలి? ఈ 5 ఆహారాలు తిని చూడండి చాలు..!

సాధారణంగా నడుస్తున్నప్పుడో, పనిచేస్తున్నప్పుడో కాళ్లు చేతులలో నొప్పులు వస్తుంటాయి. ఇలా నొప్పులు రావడం బలహీనమైన ఎముకలకు సంకేతంగా చెబుతూంటారు. బలహీనమైన ఎముకలు ఉండటం వల్ల కనీసం కూర్చోవడం, లేవడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఎముకలను బలోపేతం చేయడానికి కొన్ని ఆహారాలు తీసుకోవాలి. ఎముకలను బలంగా చేసే ఆహార పదార్థాల లిస్ట్ ఏంటో తెలుసుకుంటే..

డ్రై ఫ్రూట్స్..

డ్రై ఫ్రూట్స్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. వీటిలో కాల్షియం మాత్రమే కాదు, మెగ్నీషియం, ఫాస్పరస్ కూడా ఎముకలను బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్‌లను స్నాక్స్‌గా లేదా మిల్క్ షేక్స్, సలాడ్‌లు మొదలైన వాటిలో చేర్చడం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!


పాలు, పాల ఉత్పత్తులు..

పాలు, పెరుగు, జున్ను మొదలైన వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకల బలాన్ని, నిర్మాణాన్ని మెయింటైన్ చేయడానికి సహాయపడే ఆరోగ్యకరమైన విటమిన్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా చిన్నారుల ఎముకలు దృఢంగా ఉండేందుకు రోజూ పాలు ఇవ్వడం ముఖ్యం.

పాలకూర..

కాల్షియం పాలు, పెరుగులో మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలలో కూడా ఉంటుంది. పాలకూర ఇందులో ముఖ్యమైనది. ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. ఒక కప్పు ఉడకబెట్టిన పాలకూర తినడం వల్ల శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియంలో 25 శాతం అందుతుంది. పాలకూరలో విటమిన్ ఎ, ఐరన్, ఫైబర్ కూడా ఉంటాయి.

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!


అరటిపండు..

ఎముకలకు మేలు చేసే ఆహారాలలో అరటిపండు ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో మంచి మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుంది. దంతాలకు కూడా మేలు చేస్తుంది. అరటిపండును రోజూ తింటే ఎముకలు బలపడతాయి.

సోయా, సోయా ఉత్పత్తులు..

శాకాహారులు, ఆహారంలో మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను చేర్చాలనుకునే వ్యక్తులు వారి ఆహారంలో సోయాబీన్, సోయా ఉత్పత్తులైన టోఫు, సోయా పాలు, సోయా చంక్‌లను చేర్చుకోవచ్చు. ఎముకలను బలోపేతం చేయడంలో ప్రొటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

రోజూ పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే..!

వేయించిన శనగలు తినడం వల్ల కలిగే ప్రయోజానాల గురించి తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 07 , 2024 | 01:06 PM

Advertising
Advertising