Heat Headaches: వేడి వాతావరణం వల్ల తలనొప్పి వస్తోందా? దీని లక్షణాలు, నివారణలు ఇవే..!
ABN, Publish Date - May 02 , 2024 | 01:10 PM
శరీరం బాగా అలసిపోతేనో, వాతావరణ మార్పుల వల్లనో, శరీరంలో నీరు తక్కువైనప్పుడో, ఆకలిగా అనిపించినప్పుడో తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఇలా మాత్రమే కాకుండా వేడికి కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. అసలు ఇదెలా వస్తుంది? దీన్ని నివారించడం ఎలా?
ప్రతి వ్యక్తికి కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వాటిలో దగ్గు, జలుబు, తలనొప్పి వంటివి సహజం. ఇవన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. శరీరం బాగా అలసిపోతేనో, వాతావరణ మార్పుల వల్లనో, శరీరంలో నీరు తక్కువైనప్పుడో, ఆకలిగా అనిపించినప్పుడో తలనొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఇలా మాత్రమే కాకుండా వేడికి కూడా కొందరికి తలనొప్పి వస్తుంది. అసలు ఇదెలా వస్తుంది? దీన్ని నివారించడం ఎలా? తెలుసుకుంటే..
అధిక ఉష్ణోగ్రత లేదా వేడికి గురైనప్పుడు వేడి తలనొప్పి వస్తుంది. శరీరం వేడెక్కినప్పుడు దాని ఉష్ణోగ్రత సరిగ్గా నియంత్రించలేకపోవడం వల్ల తలలో నరాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ కారణంగా వేడి తలనొప్పి వస్తుంది. సూర్యరశ్మికి గురికావడం, వేడి వాతావరణంలో ఎక్కువగా శారీరక శ్రమ చేయడం, ఆవిరి స్నానాలు వంటివి ఎక్కువగా చేయడం వల్ల వేడి తలనొప్పి వస్తుంది.
విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!
చెమట ద్వారా శరీరం కోల్పోయే ద్రవాలను భర్తీ చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం. నీరు తగినంత తీసుకోని పక్షంలో తలనొప్పి వస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయితే శరీరంలో సెరోటోనిన్ స్థాయి కూడా ప్రభావితం అవుతుంది. ఇది తలనొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది.
లక్షణాలు..
వేడి తలనొప్పి వచ్చినప్పుడు వికారం, తలతిరగటం, కండరాల తిమ్మిరి, కండరాలు బిగుసుకుపోయినట్టు ఉండటం, మూర్ఛపోవడం, పల్స్ చాలా బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి.
అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!
వేడి తలనొప్పి నివారణ మార్గాలు..
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఆరుబయట గడపకూడదు. రోజులో అత్యంత వేడిగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు.
వేడి తలనొప్పి రావడానికి ముఖ్యమైన కారణాలలో శరీరంలో తేమ కోల్పోవడం ఒకటి. కాబట్టి శరీరంలో నీటి లోటు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు నీరు బాగా త్రాగాలి.
తలనొప్పి రాకుండా ఉండేందుకు తలకు టోపి ధరించాలి. అలాగే కళ్లకు సన్ గ్లాసెస్ ధరించడం వల్ల సూర్యకాంతికి కళ్లు ప్రభావం చెందకుండా ఉంటాయి. కాటన్ దుస్తులు ధరిస్తే చెమట, వేడి నుండి మంచి ఉపశమనం ఉంటుంది.
శరీరంలో ఎలక్ట్రోలైట్లు లోపిస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఎలక్ట్రోలైట్లు భర్తీ చేసే పానీయాలు తీసుకోవాలి.
తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి. పోషకాలు, నీటి కంటెంట్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. సమతుల్య ఆహారం శరీరానికి అందేలా చూసుకోవాలి. కెఫిన్ పానీయాలను దూరం పెట్టాలి.
వేడి తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే దాన్ని అధిగమించడానికి కోల్ట్ థెరపీ ఉపయోగించాలి. ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి చల్లని లేదా ఐస్ ప్యాక్ ఉపయోగించాలి.
అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!
విదేశాలలో ముఖేష్ అంబానీకి ఉన్న విలాసవంతమైన ఆస్తుల చిట్టా ఇదీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 02 , 2024 | 01:10 PM