Potato Adulterated: మార్కెట్లో నకిలీ ఆలుగడ్డలు.. వాసన చూసి పట్టేయొచ్చు
ABN, Publish Date - Oct 18 , 2024 | 05:29 PM
Health Tips: అమాయకపు ప్రజలను మోసగించేందుకు అక్రమార్కులు కొత్త రూట్ ఎంచుకున్నారు. నకిలీ ఆలుగడ్డలతో జనాలను బురిడీ కొట్టించేందుకు కొందరు కేటుగాళ్లు తయారవుతున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో భారీ ఎత్తున నకిలీ ఆలుగడ్డలను అధికారులు సీజ్ చేశారు. ఆలుగడ్డలను ఎక్కువకాలంపాటు తాజాగా ఉంచేందుకు హానికరమైన కెమికల్స్ వాడుతున్నట్టుగా..
Health Tips: అమాయకపు ప్రజలను మోసగించేందుకు అక్రమార్కులు కొత్త రూట్ ఎంచుకున్నారు. నకిలీ ఆలుగడ్డలతో జనాలను బురిడీ కొట్టించేందుకు కొందరు కేటుగాళ్లు తయారవుతున్నారు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ లో భారీ ఎత్తున నకిలీ ఆలుగడ్డలను అధికారులు సీజ్ చేశారు. ఆలుగడ్డలను ఎక్కువకాలంపాటు తాజాగా ఉంచేందుకు హానికరమైన కెమికల్స్ వాడుతున్నట్టుగా గుర్తించారు. వీటినే ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. కిరాణా షాపులకూ వీటినే సప్లై చేస్తున్నారు. అసలే పెరిగిన కూరగాయల ధరలు మంటపుట్టిస్తుంటే ఈ వార్తలు సామాన్యులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బినట్టుగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. దీర్ఘ కాలంలో కిడ్నీల పనితీరుపైనా ప్రభావం చూపుతాయని అంటున్నారు.
పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్లో కుప్పలు తెప్పలుగా పోసి అమ్ముతున్న ఆలుగడ్డల్లో అసలేదో నకిలీవి ఏవో తెలీక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వినియోగదారులు ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లలో నకిలీ ఆలుగడ్డలను తేలికగా గుర్తించడమెలాగో కొన్ని టిప్స్ కూడా చెప్తున్నారు.
వాసన చూసి చెప్పొచ్చు..
నకిలీ ఆలూను వాసన ద్వారానే కనిపెట్టేయొచ్చు. ముక్కుదగ్గర పెట్టుకున్నప్పుడు సాధారణంగా మనకు లభించేవి ఒక రకమైన వాసనతో ఉంటాయి.ఇలా కాకుండా కెమికల్స్ వాసన వస్తుంటే మాత్రం వాటిని కొనకపోవడమే బెటర్ అంటున్నారు.
రంగులోనూ తేడాలు..
నాణ్యమైన ఆలుగడ్డలైతే వాటిని కట్ చేసినప్పుడు బైట కనిపించే లేత గోధుమ రంగులోనే ఉంటాయి. లోపలి రంగు బయటి రంగులా కాకుండా ముదురు రంగులో ఉంటే మాత్రం నకిలీవని గుర్తించాలి. చాలా కాలం పాటు నిలువ ఉండటం, అసహజమైన పదార్థాలను వాటిపై స్ప్రే చేయడం వల్ల బయటకు ఫ్రెష్ గా లోపలి రంగు మారిపోతుంది.
వాటర్‌తోనూ టెస్ట్ చేయొచ్చు..
సాధారణ పద్ధతిలో పండించిన ఆలుగడ్డలైతే నీటిలో వేయగానే మునిగిపోతాయి. కానీ కెమికెల్స్ ను స్ప్రే చేసి అమ్ముతుంటే అలా కాకుండా నీటిలో పైకి తేలుతూ కనిపిస్తాయి. వీటిని వినియోగించకపోవడమే మంచిది.
కడిగినా మట్టి వదలకుంటే..
ఆలుగడ్డలపై ఉండే మట్టి మామూలుగా అయితే చేతులతో రుద్ది కడిగితే తొలగిపోతుంది. కానీ, నకిలీ ఆలుగడ్డలైతే పైన ఉండే మట్టి వదలకుండా అలాగే ఉంటుంది. పొట్టు కూడా మందంగా కాకుండా సన్నటి పొరలాగా ఉండి చేతితో తాకినా ఊడివచ్చేస్తుంది. వీటిని నకిలీవిగా గుర్తించి అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు తినిపించే ఆహారంలో జాగ్రత్త వహించాలి.
Also Read:
మూసీ బ్యూటిఫికేషన్ కాదు..లూటిఫికేషన్
For More Health News and Telugu News..
Updated Date - Oct 18 , 2024 | 05:29 PM