High BP: ఈ టిప్స్ ఫాలో అయితే చాలు.. హై బీపీని సహజంగా నియంత్రణలో ఉంచవచ్చు..!
ABN, Publish Date - Aug 24 , 2024 | 12:04 PM
ఒకప్పుడు ఇది పెద్దవాళ్లలోనే కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తోంది. హై బీపీ ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. హై బీపీని కేవలం మందులతోనే కాదు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా నియంత్రించవచ్చు.
అధిక రక్తపోటు లేదా హై బీపీ అనేది సాధారణ ఆరోగ్య సమస్య. ఒకప్పుడు ఇది పెద్దవాళ్లలోనే కనిపించేది. కానీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కూడా కనిపిస్తోంది. హై బీపీ ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. హై బీపీని కేవలం మందులతోనే కాదు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా నియంత్రించవచ్చు. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచే టిప్స్ ఏంటంటే..
ఆహరంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను పుష్కలంగా తీసుకోవాలి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉన్న ఆహారాల మీద దృష్టి సారించాలి.
Aloe vera Juice: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగితే జరిగేదేంటి?
సోడియం అధికంగా తీసుకుంటే రక్తపోటు కూడా పెరుగుతుంది. రోజుకు 2,300 మి.గ్రా సోడియం కంటే తక్కువ తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చిరుతిళ్ళు, వేపుళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు తినడం మానేయాలి.
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండె బలపడుతుంది. తక్కువ శ్రమతో రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఎక్కువ కాలం ఒత్తిడి కొనసాగితే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఒత్తిడిని నియంత్రించడానికి లోతైన శ్వాస, ధ్యానం, యోగా వంటివి చేయాలి.
ధూమపానం, మద్యపానం అలవాట్లు రక్తపోటు మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీస్తాయి. తద్వారా రక్తపోటు పెరగడానికి కారణం అవుతాయి. అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు వీటిని మానేయాలి.
Kids Health: డైపర్స్ కారణంగా పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయా? ఈ టిప్స్ తో తగ్గించేయండి..!
అధిక రక్తపోటు ఉన్నవారు బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. బరువు తగ్గడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. బరువు నియంత్రణ కోసం సమతుల ఆహారం, శారీరక శ్రమ రెండింటిపై దృష్టి పెట్టాలి.
శరీరంలో సోడియంను సమతుల్యం చేయడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, నారింజ, బచ్చలికూర, చిలకడదుంపలు తీసుకోవాలి. వీటిలో పొటాషియం మెండుగా ఉంటుంది. అయితే పొటాషియం ఎక్కువ త తీసుకున్నా కిడ్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా కిడ్నీ వైద్యుడిని సంప్రదించాలి.
తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!
గుండె సమస్యల నుండి వేగంగా కోలుకోవాలంటే ఈ 7 టిప్స్ పాటించండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 24 , 2024 | 12:04 PM