Hot Water: బరువు తగ్గాలంటే వేడి నీరు ఎప్పుడు తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివి..!
ABN, Publish Date - Aug 16 , 2024 | 06:17 PM
వేడినీటిని తాగితే బరువు తగ్గుతారని అంటూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు చేకూరుతాయి. అయితే
వేడినీరు శక్తివంతమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఆరోగ్యవంతమైన అలవాట్లు ఫాలో అయ్యేవారు వేడినీటిని తాగుతూ ఉంటారు. వేడినీటిని తాగితే బరువు తగ్గుతారని అంటూ ఉంటారు. ఇది మాత్రమే కాకుండా శరీరానికి బోలెడు లాభాలు చేకూరుతాయి. అయితే బరువు తగ్గడంలో ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే వేడి నీటిని ఏ సమయంలో తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలు ఏంటంటే..
బరువు తగ్గడం కోసం చాలామంది వేడినీరు తాగుతూ ఉంటారు. వేడినీరు శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీని కారణంగా ఇది పొట్ట భాగంలో పేరుకున్న కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఉదయాన్నే వేడి నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు.
Viral Video: పువ్వులే... నడిసొచ్చెనంటా..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు కరిగించడంలో సహాయపడుతుంది.
కేవలం వేడి నీరు మాత్రమే కాకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో చియా గింజలు కలిపి తాగడం వల్ల బరువు తగ్గడంలో వేగవంతమైన ఫలితాలు ఉంటాయి. ఇది కేవలం బరువు తగ్గించడంలోనే కాదు. జీర్ణాశయానికి మంచిది.
బరువు తగ్గాలని ప్రయత్నం చేసేవారు తినడానికి అరగంట ముందు లేదా తిన్న అరగంట తరువాత వేడి నీరు తాగాలి. ఇది బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
రాత్రి సమయంలో ఆహారం తిన్న తరువాత వేడినీరు తాగితే త్వరగా బరువు తగ్గుతారు. సాధారణ వేడినీరు కాకుండా జీలకర్ర, మెంతులు, దనియాలు.. ఇలా ఏదో ఒకటి కలిపి ఉడికించిన నీటిని తాగినా మెరుగైన ఫలితాలు ఉంటాయి.
ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!
గులాబీ రేకులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 16 , 2024 | 06:17 PM