Weight Loss: రోజూ ఇంత దూరం నడిస్తే సులభంగా బరువు తగ్గుతారు..
ABN, Publish Date - Dec 10 , 2024 | 09:21 AM
శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే నడక ప్రారంభించడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఇన్ని నిమిషాలు నడవడం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చని సూచిస్తున్నారు.
బరువు తగ్గడం ఎలా?: రోజువారీ నడక మీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? ఆయుర్వేదం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయడం మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగుతున్న బరువును నియంత్రించుకోవాలనుకుంటే, మీరు ప్రతిరోజూ నడకతో మీ రోజును ప్రారంభించాలి. నడక వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
30 నుండి 45 నిమిషాలు..
మీరు మీ శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును వదిలించుకోవాలనుకుంటే, ప్రతిరోజూ ఉదయం వాకింగ్ చేయండి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గడానికి మీరు ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు నడవాలి. ప్రతిరోజూ దాదాపు అరగంట పాటు వేగంగా నడవడం ద్వారా, మీరు సులభంగా బరువు తగ్గుతారు.
మొదటి రోజు అంత సేపు కంటిన్యూగా నడవకండి. ఇది మిమ్మల్ని బాగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి 15 నిమిషాల మార్నింగ్ వాక్ ప్రారంభించి క్రమంగా అర్థగంట సేపు నడవడం అలవాటు చేసుకోండి. ఇలా ప్రతి రోజు చేస్తే ఒక నెలలో మీలో మార్పు కనిపిస్తుంది. అయితే, కేవలం ఒకటి రెండు రోజులు వాకింగ్ వెళితే ప్రయోజనం ఉండదు. రెగ్యులర్ గా వెళ్లాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అద్భుతమైన ప్రయోజనాలు..
మార్నింగ్ వాకింగ్ చేస్తే మీ శరీరంలోని జీవక్రియను చాలా వరకు పెంచుతుంది. అంతేకాకుండా మీ మనసుకు విశ్రాంతినిస్తుంది. నడక ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. డయాబెటిక్ రోగులకు వైద్యులు వాకింగ్ చేయాలని సూచిస్తారు. రక్తపోటును నియంత్రించడానికి వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
Updated Date - Dec 10 , 2024 | 09:23 AM