Share News

Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!

ABN , Publish Date - Jun 29 , 2024 | 10:48 AM

వర్షాకాలంలో తడి వాతావరణం కారణంగా, వర్షపు నీటి ప్రభావం వల్లా దోమలు, కీటకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఆహారం నుండి అన్నీ చాలా సులువుగా కలుషితం అవుతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి.

Immunity Herbs: ఈ 8 మూలికలు వాడండి చాలు.. వర్షాకాలంలో రోగనిరోధకశక్తి బలపడుతుంది..!

వర్షాకాలంలో తడి వాతావరణం కారణంగా, వర్షపు నీటి ప్రభావం వల్లా దోమలు, కీటకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలంలో ఆహారం నుండి అన్నీ చాలా సులువుగా కలుషితం అవుతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని బలంగా మార్చే కొన్ని మూలికలు ఉన్నాయి. వాటిని ఉపయోగిస్తే వర్షాకాలపు ఆరోగ్య సమస్యలను తిప్పికొట్టవచ్చు. ఆ మూలికలు ఏంటో తెలుసుకుంటే..

తులసి..

తులసి రోగనిరోధక శక్తిని పెంచే గొప్ప మూలిక. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. బ్యాక్టీరియా, వైరస్, ఇన్ప్లమేషన్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఎదురయ్యే శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

Kitchen Tips: నల్లగా మారిన పాన్ ను ఇలా క్లీన్ చేసి చూడండి.. కొత్తదానిలా మెరుస్తుంది..!



అశ్వగంధ..

అశ్వగంధను అడాప్టోజెనిక్ హెర్బ్ అని పిలుస్తారు. ఇది ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.

పసుపు..

పసుపులో ఉండే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలో కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరిచి అంటువ్యాధులతో పోరాడుంది.

ఉసిరికాయ..

ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయి. అంటువ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను సమర్థవంతగా ఎదుర్కోంటాయి.

Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ నుంచి గాలి వేడిగా వస్తోందా? మీరు చేస్తున్న మిస్టేక్ ఇదే..!



అల్లం..

అల్లంలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడతాయి. రోగనిరోధక పనితీరు బలంగా ఉండేలా చేస్తాయి.

వెల్లుల్లి..

వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ సమ్మేళం శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రోగనిరోధక పనితీరును పెంచుతుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

వేప..

యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వేపలో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అంటువ్యాధుల నుండి కాపాడుతాయి.

అతిమధురం ..

అతిమధురం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాస కోశ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక పనితీరు మెరుగ్గా ఉంచుతాయి. మంటను తగ్గించడంలోనూ, కాలానుగుణ మార్పుల కారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యను పరిష్కరించడంలోనూ సహాయపడతాయి.

Ghee Test: మీరు వాడుతున్న నెయ్యి స్వచ్చమైనదేనా? ఈ 5 మార్గాల్లో తెలుసుకోండి..!

Yoga: 30రోజులు.. ఈ రెండు యోగాసనాలు వేసి చూడండి.. మీ ఫిట్‌నెస్ ఎంత మెరుగవుతుందంటే..!



(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 29 , 2024 | 10:48 AM