International Dance Day : డ్యాన్స్ అంటే బాగా ఇష్టమా? డ్యాన్స్ చేయడం వల్ల కలిగే 5 ఆరోగ్య లాభాలు ఇవే..!
ABN, Publish Date - Apr 29 , 2024 | 01:43 PM
కళలు జీవితంలో చెప్పలేని మార్పును, పాజిటివ్ దృక్పథాన్ని తీసుకువస్తాయి. అటు కళను ఆస్వాదిస్తూ. ఇటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిలో నృత్యం ఒకటి. నృత్యాన్ని డ్యాన్స్ అని పిలుస్తారు. నృత్యంలో చాలా రకాలున్నా అవి అన్నీ శరీరానికి మంచి వ్యాయామం లాంటివే..
రోజువారి జీవితంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపడంలో కొన్ని పనులు కీలకపాత్ర పోషిస్తాయి. అలాంటి వాటిలో వ్యాయమం, క్రీడలు, డ్యాన్స్ మొదలైనవి ఉంటాయి. మరీ ముఖ్యంగా కళలు జీవితంలో చెప్పలేని మార్పును, పాజిటివ్ దృక్పథాన్ని తీసుకువస్తాయి. అటు కళను ఆస్వాదిస్తూ. ఇటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిలో నృత్యం ఒకటి. నృత్యాన్ని డ్యాన్స్ అని పిలుస్తారు. నృత్యంలో చాలా రకాలున్నా అవి అన్నీ శరీరానికి మంచి వ్యాయామం లాంటివే.. డ్యాన్స్ ను రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకుంటే కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
శరీర సౌష్టవం..
డ్యాన్స్ ను కేవలం ఒక కళగా చూడలేం. దానికి మించి ఇది శరీరానికి గొప్ప వ్యాయామం. డ్యాన్స్ లో పరిచయం ఉన్నవారు రోజూ కొద్దిసేపు దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే శరీరంలో కండరాల బలం, పట్టుత్వం పెరుగుతుంది. రోజులో చేసే ఎన్నో వ్యాయామాలకు ప్రత్యామ్నాయంగా డ్యాన్స్ ను ఎంచుకోవచ్చు.
ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!
ఒత్తిడి..
డ్యాన్స్ చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది శరీరంలో ఎండార్పిన్లను విడుదల చేస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరచడంలో ఎండార్పిన్ల పాత్ర ముఖ్యమైనది. రోజువారి జీవితంలో కలిగే ఒత్తిడులు, ఆందోళనకు చెక్ పెట్టాలంటే రోజులో కొద్దిసేపు డ్యాన్స్ చేయడం మంచిది.
ఆత్మవిశ్వాసం..
డ్యాన్స్ అనేది శరీర కదలికలను ఎప్పుడూ చురుగ్గా ఉంచుతుంది. ఈ కారణంగా ఏ పనిలో అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుపోగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచడంలో కూడా డ్యాన్స్ కీలకపాత్ర పోషిస్తుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు అయినా చురుగ్గా, తెలివిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!
కనెక్షన్..
కేవలం ప్రాక్టీస్ చేయడమే కాదు.. ప్రదర్శనలు ఇవ్వడం కూడా డ్యాన్స్ ప్రత్యేకత. దీని వల్ల లభించే గుర్తింపు, కొత్త పరిచయాలు, స్నేహాలు అన్నీ సామాజికంగా వ్యక్తులను మరింత దృఢంగా ఉండేలా చేస్తుంది. అందరితో కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది.
మానసిక ఆరోగ్యం..
శారీరక ఆరోగ్యానికి, శరీరం చురుగ్గా ఉండటానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా డ్యాన్స్ చక్కని మార్గం. డ్యాన్స్ అనేది సంగీతంతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి సంగీతం, డ్యాన్స్ రెండూ మానసిక స్థితిని చాలా ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతాయి. వయస్సు పెరిగేకొద్దీ ఎదురయ్యే మతిమరుపు సమస్యలకు కూడా డ్యాన్స్ చెక్ పెడుతుంది.
ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!
ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Apr 29 , 2024 | 01:43 PM