Angry: తరచూ కోప్పడుతున్నారా.. ఈ ప్రమాదాలు తెలుసుకుంటే జీవితంలో కోప్పడరు
ABN, Publish Date - May 07 , 2024 | 01:21 PM
కోపం రాని వారుంటారా చెప్పండి. కొంతమంది సిల్లీ కారణాలకు మాటామాటికీ కోపం(Angry) తెచ్చుకుంటారు. కోపం అనేది ఎమోషన్. కాబట్టి రావడంలో తప్పు లేదు. కానీ తరచూ కోపడ్డుతూ ఉంటే జరిగే అనర్థాలు మీకు తెలుసా. నిరాశ, అన్యాయం, బెదిరింపు వంటి అనేక కారణాల వల్ల కోపం వస్తుంది. నియంత్రణ లేని కోపం గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఇంటర్నెట్ డెస్క్: కోపం రాని వారుంటారా చెప్పండి. కొంతమంది సిల్లీ కారణాలకు మాటామాటికీ కోపం(Angry) తెచ్చుకుంటారు. కోపం అనేది ఎమోషన్. కాబట్టి రావడంలో తప్పు లేదు. కానీ తరచూ కోపడ్డుతూ ఉంటే జరిగే అనర్థాలు మీకు తెలుసా. నిరాశ, అన్యాయం, బెదిరింపు వంటి అనేక కారణాల వల్ల కోపం వస్తుంది. నియంత్రణ లేని కోపం గుండెపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
కోపం, చిరాకు, ఆగ్రహం.. గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర హృదయ సంబంధ సమస్యలను తీసుకొస్తాయి. కోపం శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ హార్మోన్ల పెరుగుదలకు కారణమవుతుంది. ఈ హార్మోన్లు రక్తపోటు, హృదయం కొట్టుకునే రేటు, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవన్నీ గుండెపై ఒత్తిడిని కలిగిస్తాయి. తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అధిక రక్తపోటును హైపర్‌టెన్షన్(హైబీపీ) అని అంటారు. హైబీపీ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు రావడానికి ప్రధాన కారణం.
కోపం హృదయ స్పందన రేటు పెరగడానికి కారణమవుతుంది. ఇది క్రమంగా గుండె పోటుకు దారి తీస్తుంది. దీర్ఘకాలికంగా ఉండే కోపం, ఒత్తిడి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. తద్వారా హృదయ సంబంధిత వ్యాధులు మరింతగా చుట్టుముడుతాయి. కోపం వచ్చినప్పుడు కొందరు అతిగా తినడం సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వంటివి చేస్తుంటారు. ఇవి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి.
కోపాన్ని కంట్రోల్ చేసుకోండిలా..
కాబట్టి కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. కోపం అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. శ్వాస మీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉండగలం. వ్యాయామం, యోగా చేయడం కూడా కోపాన్ని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి. అప్పటికీ కోపం కంట్రోల్ కాకపోతే వైద్యులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలి.
Brain Stroke Causes: ఏసీలో కూర్చుని ఎండలోకి వెళ్తున్నారా.. ఈ వ్యాధులున్నవారికి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం
For Latest News and Health News click here
Updated Date - May 07 , 2024 | 01:21 PM