ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మయోనీస్‌ మంచిది కాదా..

ABN, Publish Date - Dec 01 , 2024 | 09:48 AM

సాస్‌, కెచప్‌, మయోనీస్‌ వాడకం కేవలం రెస్టారెంట్లలో మాత్రమే కాక ఈ మధ్య ఇళ్లల్లో కూడా పెరిగింది. ఈ సాస్‌లను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు... వాటి రుచి, రంగు ఆకర్షణీయంగా ఉండేందుకు వివిధరకాల ప్రిజర్వేటివ్స్‌, ఫుడ్‌ కలర్స్‌, ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌ వంటివి వాటి తయారీలో వాడతారు.

మయోనీస్‌ గురించిన వార్తలు కలవరపెడుతున్నాయి. మేము తరచూ శాండ్‌విచ్‌, బర్గర్లు, పాస్తా వంటివి చేసుకుంటాం. సాస్‌, కెచప్‌, మయోనీస్‌ వంటివి వాడుతుంటాం. వీటితో ఏమైనా ప్రమాదమా?

- నిహారిక, విశాఖపట్టణం

సాస్‌, కెచప్‌, మయోనీస్‌ వాడకం కేవలం రెస్టారెంట్లలో మాత్రమే కాక ఈ మధ్య ఇళ్లల్లో కూడా పెరిగింది. ఈ సాస్‌లను ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు... వాటి రుచి, రంగు ఆకర్షణీయంగా ఉండేందుకు వివిధరకాల ప్రిజర్వేటివ్స్‌, ఫుడ్‌ కలర్స్‌, ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్స్‌ వంటివి వాటి తయారీలో వాడతారు. తరచూ వీటి వల్ల ఆరోగ్యానికి ప్రమాదమే. చక్కెర, నూనె లేదా కొవ్వు పదార్థాలు అధికంగా ఉండడం వల్ల పోషకాలు లేకుండా అనవసరమైన క్యాలరీలు కూడా వస్తాయి. వీటిని సరైన పద్ధతిలో నిల్వ ఉంచకపోతే హానికారక సూక్ష్మజీవులు చేరి ఫుడ్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలున్నాయి. అందుకే సాస్‌, మయోనీస్‌ వంటివి పరిమితంగానే వాడాలి. వీటిని నిల్వ ఉంచే విషయంలో కూడా ప్యాకెట్లపై రాసినట్టు ఫ్రిజ్‌లో పెట్టడం, ఎక్సపైరీ డేట్‌ దాటినా తరువాత పారెయ్యడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.


నా వయసు 55 ఏళ్లు. ఈ మధ్య గుండెపోటు వార్తలు విని భయమేస్తోంది. ఫిట్‌గానే ఉంటాను. రోజూ ప్రొద్దున్నే నడక అలవాటు ఉంది. గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిది?

- కె.రాజశేఖర్‌, కరీంనగర్‌

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, జీవన శైలి కూడా ముఖ్యమే. ఆహారంలో సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె మానెయ్యడం మంచిది. రెడ్‌ మీట్‌ బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌, చేప వంటివి మాత్రమే తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ అందులో గుండెకు మేలు చేసే పోషకాలున్నందున వారానికి 4-5 మించకుండా గుడ్లు (పచ్చసొనతో సహా) తీసుకోవచ్చు.

యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి. బరువు ఎక్కువ ఉన్నవారు కొంత బరువు తగ్గాలి కూడా. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచి కొవ్వులు ఉండే బాదం, ఆక్రోట్‌, అవిసెగింజల వంటి వాటిని ప్రతిదినం ఆహారంలో భాగం చేసుకోవాలి. వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత వంటి తేలికపాటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం ముఖ్యం. మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు ఏవైనా వ్యాపకాలు ఎంచుకోవడం, ధ్యానం చేయడం కూడా పనికొస్తాయి.


నేనొక ప్రభుత్వ ఉద్యోగిని. వయసు 47 ఏళ్లు. థైరాయిడ్‌, షుగర్‌ ఉంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా రవ్వ ఉప్మా, బ్రెడ్‌, పాలు వంటివి తీసుకుంటున్నా? ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

- శైలజ, హైదరాబాద్‌

మెనోపాజ్‌కు దగ్గరయ్యే వయసులో మహిళలు ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందులోనూ థైరాయిడ్‌, డయాబెటీస్‌ వంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టయితే జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అల్పాహారంగా తీసుకొనే రవ్వ ఉప్మా, బ్రెడ్‌, ఇడ్లీ వంటి వాటిల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు మొదలైనవి తక్కువగానూ, పిండిపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. అందువలన బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్ల కోసం గుడ్లు, పాలు, ఉడికించిన సెనగలు, సోయాచిక్కుడు వంటి గింజలు మొదలైనవి తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అలాగే ఉడికించిన కూరగాయలు కూడా తీసుకొంటే రక్తంలో గ్లూకోజు పరిమాణం సరిగా నియంత్రించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు కొద్దిగా బాదం, ఆక్రోట్‌, పిస్తా, పల్లీ వంటి నట్స్‌, వంద గ్రాములకు మించకుండా ఏవైనా తాజా పండ్లు చేర్చుకుంటే మంచిది. పిండి పదార్థాలు అధికంగా ఉండే ఇడ్లీ, దోసె, ఉప్మా, పోహా, బ్రెడ్‌ వంటివి చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటూ పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగం చేసుకోండి.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

Updated Date - Dec 01 , 2024 | 09:48 AM