Jackfruit: పనసపండును ఇష్టంగా తినేవారు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు..!
ABN, Publish Date - Oct 10 , 2024 | 09:59 PM
పనస పండు అంటే చాలా మందికి చెప్పలేనంత ఇష్టం. పనస పండు వాసన ఎంతో దూరం నుండే నోరూరిస్తుంది. కానీ పనస పండు గురించి చాలామందికి కొన్ని నిజాలు తెలియవు.
పనసపండు భారతీయుల ఆహారంలో చాలా ముఖ్యమైనది. చిన్న పిల్లల రైమ్స్ నుండి పెద్దలు సరదాగా అటు వైపు ఇటు వైపు కూర్చుని పనస పండును వలవడానికి కుస్తీ పట్టడం వరకు చాలా సరదాలు పనసపండుతో ముడి పడి ఉంటాయి. పనస పండు తియ్యగా, మంచి సువాసనతో అందిరినీ ఆకట్టుకుంటుంది. కేవలం పనస తొనలు మాత్రమే కాకుండా పనస పొట్టు, పనస విత్తనాలు అన్నీ కూడా ఆరోగ్యం చేకూర్చేవే.. అయితే పనస పండును ఇష్టంగా తినేవారికి తెలియని నిజాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
Skin Care: కళ్ల కింద చర్మం ముడతలు పడిందా? ఈ ఐ ప్యాక్ ట్రై చేయండి..!
అలర్జీలు..
పనస పండు అందరికీ వంటదు. కొందరికి పనస పండు అంటే అలెర్జీ ఉంటుంది. ఇలాంటి వారు పనస పండు తినకూడదు. రుచి కోసమో.. సువాసన కు ఫిదా అయ్యో.. పనస పండు తింటే దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
మధుమేహం..
మధుమేహ రోగులు పొరపాటున కూడా పనస పండు తినకూడదు. పనస పండులో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. ఎక్కువగా తీపి ఉన్న, బాగా పండిన పనస తొనలను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదు. కాస్త పచ్చిగా, తీపి లేని పనస తొనలను తినవచ్చు. అయితే అవి కూడా మితంగానే..
గర్భవతులు..
గర్భిణి స్త్రీలు పనస పండును చాలా పరిమితంగా తీసుకోవాలి. రుచి మీద ఇష్టంతో కొందరు ఎక్కువ తినేస్తారు. కానీ గర్భవతులు పనస పండును ఎక్కువగా తింటే జీర్ణవ్యవస్థను బలహీనంగా మారుతుంది. అప్పటికే జీర్ణ సంబంధ సమస్యతో ఇబ్బంది పడేవారు పనసపండును తినకపోవడం మంచిది.
Peanuts: అందరూ ఎంతో ఇష్టంగా తినే వేరుశనగ.. ఈ సమస్యలు ఉన్నవారికి చాలా డేంజర్..!
జీర్ణక్రియ..
పనసపండులో ఫైబర్ అధికం. దీని వల్ల జీర్ణక్రియ పేలవంగా ఉన్నవారు పనస పండు తీసుకుంటే గ్యాస్, మలబద్దకం, అజీర్ణం వంటి ఇతర సమస్యలు వస్తాయి.
శస్త్రచికిత్స..
ఎవరైనా ఏదైనా శస్త్రచికిత్సలు చేయించుకుని ఉంటే అలాంటి వారు పనస పండుకు దూరంగా ఉండాలి. ఇది రక్తం గడ్డ కట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. శస్త్రచికిత్సలు అయిన వారు కుట్లు, గాయాలు మానడంలో ఇబ్బంది ఏర్పరుస్తుంది.
మూత్ర పిండాలు..
పనస పండులో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి అస్సలు మంచిది కాదు. మూత్ర పిండాల సమస్యలు ఇంకా పెంచుతుంది.
ఇవి కూడా చదవండి..
Phool Makhana: మగవాళ్లకు ఫూల్ మఖానా చేసే మేలెంత? మీకు తెలియని నిజాలివి..!
Hair Care: జుట్టు దువ్వేటప్పుడు చేసే ఈ పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణాలు..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 10 , 2024 | 09:59 PM