ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jai Phal: ఆడవారు జాజికాయను పాలలో కలిపి తాగితే ఇన్ని లాభాలుంటాయని తెలుసా?

ABN, Publish Date - Jun 25 , 2024 | 04:16 PM

భారతీయ వంటింట్లో ప్రతి మసాలా దినుసు వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి వాటిలో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను మంచి సువాసన కోసం వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఆడవారు ఈ జాజికాయను పాలలో కలిపి తాగితే

భారతీయ మసాలా దినుసులలో ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి మసాలా దినుసు వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలాంటి వాటిలో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను మంచి సువాసన కోసం వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే ఆడవారు ఈ జాజికాయను పాలలో కలిపి తాగితే షాకింగ్ ఫలితాలుంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జాజికాయ శతాబ్దాల నాటి నుండే విరివిగా ఉపయోగించబడింది. ఆయుర్వేదం నుండి పురాతన ఔషధాల వరకు జాజికాయ నిద్ర, ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి శక్తివంతమైన ఔషదంగా ఉపయోగించబడింది.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


జాజికాయను పాలతో కలిపి తాగితే యాంటిడిప్రెసెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒక గొప్ప మూడ్ లిఫ్టర్. సెరోటోనిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది నిద్రను ప్రేరేపించడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జాజికాయ జీర్ణశక్తిని పెంచుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అజీర్ణం లక్షణాలను తగ్గిస్తుంది. వికారాన్ని కూడా తగ్గిస్తుంది. జాజికాయలో ఉంే శోథ నిరోధక ప్రభావాల కారణంగా కడుపు అల్సర్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుంది.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


జాజికాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి కారణమవుతుంది. అదనంగా జాజికాయలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలతో పోరాడటానికి, చర్మాన్ని క్లియర్ చేయడానికి సహాయపడతాయి.

ఆహార నిపుణుల ప్రకారం జాజికాయను ఆహారంలో పరిమిత మొత్తంలో తీసుకుంటే సురక్షితంగా ఉంటుంది. కానీ జాజికాయను అధికంగా తీసుకుంటే మాత్రం ప్రమాదకరం. వికారం, వాంతులు భ్రాంతులు కలిగించవచ్చు.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 25 , 2024 | 04:16 PM

Advertising
Advertising