ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jamun Fruit: నేరేడు పండ్లు ఇలా తింటే 10 జబ్బులు పరార్..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 02:25 PM

నేరేడు పండ్లు వర్షాకాలంలో కాస్తాయి. ఇవి మార్కెట్ లో కూడా విరివిగా అందుబాటులో ఉంటాయి. కొందరు నేరేడు పండ్లను జామ్ లు, స్వీట్లు, సలాడ్ లు, జ్యూసుల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే..

Jamun Fruit

నేరేడు పండ్లు వర్షాకాలంలో కాస్తాయి. ఇవి మార్కెట్ లో కూడా విరివిగా అందుబాటులో ఉంటాయి. కొందరు నేరేడు పండ్లను జామ్ లు, స్వీట్లు, సలాడ్ లు, జ్యూసుల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఇలా కాకుండా సహజంగా కాస్త పచ్చిగానే తినాలి. అలా తింటే 10 వ్యాధులు మంత్రించినట్టు మాయమవుతాయి.

  • రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడే జంబోలిన్, జంబోసిన్ అనే సమ్మేళనాలు నేరేడులో ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.

  • జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ఎంజైమ్ లు నేరేడులో ఉంటాయి. మలబద్దకం, అపానవాయువు, గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది.

Walking: ఈ వాకింగ్ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!



  • నేరేడులో విటమిన్-సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

  • పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

  • నేరేడు పండ్లను నేరుగా తింటే రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.

  • చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలోనూ నేరేడు పండ్లు సహాయపడతాయి.

  • నేరేడు పండ్లను సీజన్ మొత్తం తీసుకుంటూ ఉంటే రక్తం శుద్ది అవుతుంది. రక్తంలో పేరుకున్న టాక్సిన్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

  • తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న కారణంగా నేరేడు పండ్లు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.

Brain Health: మీ మెదడు బలహీనంగా ఉందని చెప్పే 5 లక్షణాలు ఇవీ.. వెంటనే చెక్ చేసుకోండి..!



  • నేరేడు చెట్టు ఆకులను దంతాలు, చిగుళ్లుకు సంబంధించిన సమస్యలను చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. చిగుళ్ల వాపు, పంటి నొప్పి, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

  • కాలేయ సమస్యలతో ఇబ్బంది పడేవారికి నేరేడు పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. కాలేయాన్ని శుద్ది చేయడంలోనూ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది.

  • భారతదేశంలో అధిక శాతం మంది ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే నేరేడు పండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారికి మంచిది.

గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన పండ్లు, కూరగాయల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 23 , 2024 | 02:25 PM

Advertising
Advertising
<