Washington: వరుసగా నైట్ షిఫ్టులు చేస్తే ఇంత డేంజరా.. ఆ అధ్యయనంలో ఆందోళనకర విషయాలు
ABN, Publish Date - May 15 , 2024 | 09:18 PM
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్‌ని ప్రచురించారు.
న్యూయార్క్: కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్‌ని ప్రచురించారు. వరుసగా మూడు రోజులు నైట్ షిఫ్ట్ చేయడం ద్వారా మధుమేహం, స్థూలకాయం ఇతర జీవక్రియ రుగ్మతల బారిన పడతారని ఆ జర్నల్ సారాంశం.
మెదడు పనితీరుసైతం మందగిస్తుందని, హృదయ స్పందనలు క్రమం తప్పుతాయని, జీవ సమతుల్యత దెబ్బతింటుందని, రక్తంలో గ్లూకోజ్ నియంత్రణలో ఉండదని ఇది తెలిపింది. ప్రధాన పరిశోధకులలో ఒకరైన ప్రొఫెసర్ హన్స్ వాన్ డాంగెన్ నైట్ షిఫ్టుల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను నొక్కి చెప్పారు.
శరీరంలో ప్రోటీన్ లయలను అస్తవ్యస్తంగా మార్చడానికి వరుసగా మూడు రాత్రి షిఫ్టులు సరిపోతాయని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. పరిశోధన బృందం రక్త నమూనాలను ఉపయోగించి శరీర రోగనిరోధక వ్యవస్థ, గ్లూకోజ్ నియంత్రణకు సంబంధించిన కీలకమైన ప్రోటీన్‌లను గుర్తించింది. కొన్ని ప్రొటీన్‌లు నైట్ షిఫ్ట్‌ల ద్వారా ప్రభావితం కానప్పటికీ, వాటి లయల్లో గణనీయమైన మార్పులను సంభవించాయి.
దీనికితోడు బీపీ, గుండె జబ్బులు వచ్చి.. చివరికి హార్ట్ ఎటాక్‌కి దారి తీయవచ్చని తేలింది. కంపెనీల యజమానులు నైట్ షిఫ్ట్ చేస్తున్న ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ అందించాలని.. తరచూ బ్రేక్ తీసుకునే వెసులుబాటు కల్పించాలని నిపుణులు సూచించారు. నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేసేవారు ఆరోగ్యకర ఆహారం తీసుకుని.. పగటిపూట సరిపడే నిద్ర పోవాలని చెబుతున్నారు. వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు.
For Latest News and Business News
Updated Date - May 15 , 2024 | 09:19 PM