Kitchen Tips: కిచెన్ టవల్స్ వాసన వస్తున్నాయా.. ఇలా క్లీన్ చేస్తే ఫ్రెష్ గా ఉంటాయ్..
ABN, Publish Date - Nov 09 , 2024 | 02:20 PM
వంటింటి తాలూకు వాసనను పులుముకుని చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి కిచెన్ టవల్స్. ఎంత సోప్ పెట్టి ఉతికినా వీటి నుండి అదొక రకమైన వాసన వెదజల్లుతూనే ఉంటుంది. దీన్ని తొలగించుకోవాలంటే ఇలా చెయ్యాలి.
వంట గదిలో వేడి పాత్రలు పట్టుకోవడం నుండి స్టౌ మీద, కిచెన్ కౌంటర్ మీద పడిన నీరు, నూనె, వంట తాలూకు పదార్థాలు వంటివి తుడవడం వరకు అన్నింటికి కిచెన్ టవల్స్ ఉపయోగిస్తుంటారు. ఇక రోజులో పని అయిపోగానే కిచెన్ కౌంటర్ ను, స్టౌ ను కిచెన్ టవల్ తోనే శుభ్రం చేస్తుంటారు. మిక్సీ, గ్రైండర్ వంటి వస్తువుల శుభ్రత గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొత్తం మీద కిచెన్ లో కింగ్ లాగా నిలిచేది కిచెన్ టవల్స్ ఏ.. పేరుకు కిచెన్ టవల్స్ అంటారు కానీ చాలా మధ్య తరగతి ఇళ్లలో పాత టవళ్లు, చిరిగిపోయిన బట్టలను కిచెన్ లో వాడుతుంటారు. అయితే వంటింటి తాలూకు వాసనను పులుముకుని చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. ఎంత సోప్ పెట్టి ఉతికినా వీటి నుండి అదొక రకమైన వాసన వెదజల్లుతూనే ఉంటుంది. అలా కాకుండా కిచెన్ టవల్స్ ను శుభ్రం చేసిన ప్రతి సారి అప్పుడే కొత్తగా వాడుతున్న వస్త్రంలా ఫ్రెష్ గా అనిపించాలంటే వాటిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
Rainbow Diet: రెయిన్ బో డైట్ అంటే ఏంటి? దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే..!
డిటర్జెంట్ లో..
కిచెన్ టవల్స్ వాసన రాకూడదంటే టవల్స్ ను డిటర్జంట్ లో కనీసం 15 నిమిషాలు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని బ్రష్ తో బాగా రుద్ది కడగాలి. వాటిలో మురికి పోయేలాగా చూడాలి. ఇలా చేస్తే టవల్స్ బాగా శుభ్రపడి వాసన వదులుతాయి.
వేడి నీరు..
వేడి నీరు కిచెన్ టవల్స్ ను శుభ్రం చేయడంలో బాగా సహాయపడుతుంది. మురికి పట్టిన కిచెన్ టవల్స్ ను వేడి నీటిలో నానబెట్టి కొద్దిసేపు అలాగే వదిలెయ్యాలి. కుదిరితే టవల్స్ ను ఉడుకుతున్న నీటిలో వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత బాగా ఉతికి శుభ్రం చెయ్యాలి. వాసన పోతుంది.
లిక్విడ్ బ్లీచ్..
మొండి మరకలు, మొండి వాసన పోవాలంటే లిక్విడ్ బ్లీచ్ బాగా సహాయపడుతుంది. లిక్విడ్ బ్లీచ్ ను నీళ్లలో కలిపి కిచెన్ టవల్స్ ను అందులో నానబెట్టాలి. కొంచెం సేపటి తరువాత టవల్స్ ను నార్మల్ గా ఉతికి ఆరబెట్టాలి.
Health Tips: బాబోయ్.. రాగులు మంచి పోషకాహారమే అనుకున్నాం.. కానీ దీంతో ఈ లాభాలు కూడా ఉన్నాయా..
వెనిగర్..
కిచెన్ టవల్స్ వాసన వదిలించడంలో వెనిగర్ బాగా సహాయపడుతుంది. వేడి నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా, డిష్ సోప్ కలపాలి. ఇందులో టవల్ నానబెట్టాలి. కొంచెం సేపటి తరువాత వాటిని సాధారణంగా ఉతికి శుభ్రం చేయాలి.
మైక్రోవేవ్..
కాస్త షాకింగ్ గా అనిపిస్తుంది కానీ సింథటిక్ బట్టలలో బ్యాక్టీరియా అభివృద్ది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియాను తొలగించడానికి శుభ్రం చేసిన సింథటిక్ టవళ్లను మైక్రోవేవ్ లో ఉంచి వేడి చేయాలి. ఇలా చేస్తే వాసన కూడా పోతుంది.
ఇవి కూడా చదవండి..
Custard Apple: సీతాఫలాల కాలం.. ఆరోగ్యానికి భలే లాభం..
Skin Care: మెరిసే చర్మం కోసం ఫేస్ క్రీములు అక్కర్లేదు.. నీళ్లు ఇలా తాగి చూడండి..
మరిన్ని ఆరగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Nov 09 , 2024 | 02:20 PM