ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: బియ్యం కడిగిన నీటిని పడేస్తుంటారా.. వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చంటే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 03:17 PM

బియ్యం కడగగానే ఆ నీటిని సింకులో పోయడం అందరూ చేసే పని. కానీ వాటిని ఈ మార్గాలలో వాడితే ఆశ్చర్యపోతారు.

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అన్నానికే పెద్ద పీట వేస్తారు. అయితే అన్నం వండేముందు బియ్యాన్ని కడగటం సహజం. బియ్యం కడిగిన నీటిని సింపుల్ గా సింకులో పోసేయడం అందరూ చేసే పనే.. బియ్యం కడిగిన నీరు సహజంగా మబ్బుగా ఉంటుంది. అయితే ఈ నీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఈ నీటిని సింకులో పడేయకుండా వీటిని తిరిగి ఉపయోగించడం వల్ల వివిధ లాభాలు కూడా చేకూరతాయి. బియ్యం కడిగిన నీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు.. వాటి వల్ల కలిగే లాభాలేంటి తెలుసుకుంటే..

హెయిర్ క్లెన్సర్..

బియ్యం కడిగిన నీటిలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బియ్యం నీటిని చాలా ఏళ్ల నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. షాంపూతో తల స్నానం చేసిన తరువాత జుట్టుపై బియ్యం నీటిని పోసి మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తరువాత సాధారణ నీటితో తలస్నానం చేయాలి. బియ్యం కడుగులో ఉండే పోషకాలు జుట్టును బలంగా మారుస్తాయి. జుట్టు విరిగిపోవడం, చిట్లిపోవడం, సున్నితంగా మారడం తగ్గుతుంది. జుట్టుకు మెరుపు కూడా వస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తుంటే జుట్టులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది.


ఫేస్ టోనర్..

బియ్యం నీరు చర్మానికి టోనర్ గా పనిచేస్తుంది. మొదట ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ బాల్ ను బియ్యం నీటిలో ముంచి ముఖమంతా అప్లై చేయాలి. బియ్యం నీటిలో పోషకాలు ముఖ చర్మ రంధ్రాలను బిగించి ముడుతలు లేకుండా చేస్తాయి. చర్మానికి నేచురల్ మెరుపును ఇస్తాయి. దీంతో మరింత మంచి ఫలితాలు కావాలంటే బియ్యం నీటిని 30 నిమిషాలు ఫ్రిడ్జ్ లో ఉంచి వాడవచ్చు. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.

మొక్కలకు..

మొక్కలు బాగా పెరగాలంటే బియ్యం నీరు బాగా సహాయపడుతుంది. మొక్కలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలు బియ్యం నీటిలో ఉంటాయి. ఇవి సహజ ఎరువుగా ఉపయోగపడతాయి.


పొడి చర్మం..

పొడ చర్మం ఉన్నవారికి బియ్యం నీరు మ్యాజిక్ ఫలితాలు ఇస్తుంది. స్నానానికి సిద్దం చేసుకునే నీటిలో కొంచెం బియ్యం నీరు కలపాలి. 10-15 నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత స్నానం చెయ్యాలి. ఇది చర్మానికి తేమను అందిస్తుంది. చర్మం మీద మంట, ఎరుపుదనం వంటివి తగ్గిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

క్లీనింగ్..

శుభ్రపరచడంలో కూడా బియ్యం నీరు సహాయపడుతుంది. కిచెన్ కౌంటర్, సింక్ తదితర వంట గది ప్రదేశాలను బియ్యం నీటితో శుభ్రం చేస్తే తేలికగా శుభ్రమవుతాయి. ఇందుకోసం బియ్యం నీటిలో ఒక గుడ్డను ముంచి ఆ గుడ్డతో తుడవాలి. బియ్యం నీళ్లలో ఆమ్లతత్వం ఉంటుంది. ఇది రసాయనాలు అవసరం లేకుండానే మొండి మరకలను సైతం తొలగిస్తుంది.

Updated Date - Nov 08 , 2024 | 03:17 PM