ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kurnool: రేడియాలజీ.. ఓ అద్భుతం...

ABN, Publish Date - Nov 08 , 2024 | 10:11 AM

ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్‌ చేసేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో అడ్మిషన్‌ అవసరం లేకుండా సిటీ స్కాన్‌ అందుబాటులో వచ్చింది. ప్రారంభంలో సింగిల్‌ స్కాన్‌లు ఉండేవి. డ్యూయల్‌ 4, 8, 16, స్లయస్‌ నుంచి ప్రస్తుతం 250, 320, స్లయస్‌ సిటీ స్కాన్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి.

- ఎక్స్‌రే నుంచి ఎంఆర్‌ఐ వరకు

- ‘ఎక్స్‌’ కిరణాల ఆవిష్కరణతో విప్లవాత్మక మార్పులు

- నేడు వరల్డ్‌ రేడియాలజీ డే

కర్నూలు: ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్‌ చేసేవారు. ఇప్పుడు ఆసుపత్రిలో అడ్మిషన్‌ అవసరం లేకుండా సిటీ స్కాన్‌ అందుబాటులో వచ్చింది. ప్రారంభంలో సింగిల్‌ స్కాన్‌లు ఉండేవి. డ్యూయల్‌ 4, 8, 16, స్లయస్‌ నుంచి ప్రస్తుతం 250, 320, స్లయస్‌ సిటీ స్కాన్‌ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. గుండె, కిడ్నీ, మెదడు, లివర్‌ వ్యాధులతో పాటు రక్తనాళాల్లోని లోపాలను గుర్తించే అత్యాధునిక సిటీ స్కాన్‌లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడా లేని విధంగా కర్నూలు జీజీహెచ్‌ రేడియాలజీ విభాగంలో ఈ విధానాలు ప్రొసిజర్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Kurnool: రాయలసీమ వర్సిటీలో దాహం కేకలు...


కర్నూలు జీజీహెచ్‌లో రికార్డు స్థాయిలో సేవలు

కర్నూలు జీజీహెచ్‌లో రేడియాలజీ విభాగం 1958లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 20 మంది పీజీలు ఉన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు పక్కనున్న తెలంగాణ గద్వాల జిల్లా, వనపర్తి జిల్లాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ప్రతి నెల ఎక్స్‌రేలు 10వేల మందికి గాను 30 వేల ఎక్స్‌రేలు, అల్ర్టాసౌండ్‌ పరీక్షలు నెలకు 10వేలు, సిటీ స్కాన్‌లు నెలకు 4622, ఎంఆర్‌ఐ నెలకు 1825, బయాప్స్‌ పరీక్షలు 120 దాకా చేస్తుంటారు. ఈ విభాగంలో డైరెక్టు డిజిటల్‌ రేడియోగ్రఫీ మిషన్‌తో పాటు 500 ఎంఏ యంత్రాలు నాలుగు, 300 ఎంఏ 2, పోర్టబుల్‌ మిషన్లు 12 ఉన్నాయి. ఇక మాగ్నటిక్‌ రిసోర్సెస్‌ ఇమేజింగ్‌ (ఎంఆర్‌ఐ) స్కాన్‌ కర్నూలు జీజీహెచ్‌లో 15 టెస్లా, సిటీ స్కాన్‌ 16 స్లెయిస్‌ అందుబాటులో ఉంది.


రేడియాలజీ ఆవిష్కరణ తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మానవ, జంతువుల శరీరాలను ప్రభావితం చేసే పరిస్థితులను గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఇమేజింగ్‌ సాంకేతికతను ఉపయోగించే వైద్యరంగంలో, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో రేడియాలజీకి అద్భుతమైన పాత్ర ఉంది. 1895లో జర్మనీకి చెందిన ప్రొఫెసర్‌ రాంట్‌జన్‌ అనుకోకుండా ఎక్స్‌రే కిరణాలను కనుగొన్నారు. ఆయన పుట్టిన రోజు నవంబరు 8న వరల్డ్‌ రేడియాలజీ డేను నిర్వహించడం ఆనవాయితీ. 2024న రేడియో గ్రాఫర్స్‌ సీయింగ్‌ ది అన్‌సీన్‌ అన్న నినాదాన్ని ఇచ్చారు.


ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ ఓ ప్రత్యేకం

రేడియాలజీ విభాగంలో ఓ ప్రత్యేక రంగం ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీ. ఇంటర్వెన్షనల్‌ రేడియాలజిస్టు గా డా. బి.అరుణ్‌ కుమార్‌ కర్నూలు జీజీహెచ్‌లో సేవలు అందిస్తున్నారు. ఆపరేషన్‌, కోత లేకుండా రక్తనాళాల ద్వారా మందులు ఇచ్చే ఈ ప్రక్రియలో డా.అరుణ్‌ కుమార్‌ ఎన్నో ప్రొసిజర్స్‌ నిర్వహించారు.


రేడియాలజీ గుండెలాంటిది

వైద్యరంగంలో రేడియాలజీ విభాగం గుండె కాయలాంటిది. క్యాన్సర్‌, పగుళ్లు, ఇన్‌ఫెక్షన్‌ల వంటి పరిస్థితులను ముందుగానే గుర్తించడానికి రేడియాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఛాతి ‘ఎక్స్‌’ కిరణాలు న్యూమోనియా లేదా ఊపిరితిత్తుల వ్యాధుల తీవ్రతను గుర్తించడంలో సహాయపడతాయి. ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్‌తో పాటు ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన పరీక్షలు, చికిత్స అందిస్తున్నాం.

-డా.డి. హరినాథ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌,

రేడియాలజీ విభాగం, కర్నూలు జీజీహెచ్‌


రేడియాలజిస్టుల పాత్ర కీలకం

గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల వరకు నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర ఎంతో కీలకం. ఎక్స్‌రే నుంచి డిజిటల్‌ ఎక్స్‌రే, సిటీ, ఎంఆర్‌ఐ, అల్ర్టాసౌండ్‌ స్కాన్లు వరకు ఇంటర్వేన్షనల్‌ రేడియాలజీ సేవలు వైద్యరంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ప్రతి నెల 30వేల ఎక్స్‌రేలు, 10వేల అల్ర్టాసౌండ్‌, 4622 సిటీ, ఎంఆర్‌ఐ, 1825 వరకు ప్రతి నెల నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రేడియాలజీతో పాటు ఇంటర్వేన్షనల్‌ రేడియాలజీ ప్రొసీజెస్‌ నిర్వహిస్తున్నాం.

- డా.కే. రాధారాణి, ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌వోడీ, రేడియాలజీ విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల


ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్‌ నుంచి నగరానికి హెరాయిన్‌.. ఐటీ కారిడార్‌లో విక్రయం

ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2024 | 10:11 AM