ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Leftover Chapati: రాత్రి మిగిలిపోయిన చపాతీలకు ఇంత పవర్ ఉందా? వీటిని తింటే ఏం జరుగుతుందంటే..!

ABN, Publish Date - Jul 30 , 2024 | 10:49 AM

చాలా ఇళ్లలో రాత్రి చపాతీలు తిన్నాక కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. తాజాగా ఉన్న ఆహారమే మంచిదని అనుకునేవారు వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ రాత్రి మిగిలిపోయిన చపాతీలు తాజా చపాతీలకంటే..

Leftover Chapati

చపాతీ చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం ఎంపిక. ముఖ్యంగా డైటింగ్ చెసేవారు, ఫిట్ నెస్ ను జాగ్రత్తగా చూసుకునేవారు రాత్రి సమయంలో అన్నానికి బదులుగా చపాతీలు తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా ఇళ్లలో రాత్రి చపాతీలు తిన్నాక కొన్ని మిగిలిపోతూ ఉంటాయి. తాజాగా ఉన్న ఆహారమే మంచిదని అనుకునేవారు వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ రాత్రి మిగిలిపోయిన చపాతీలు తాజా చపాతీలకంటే చాలా ఆరోగ్యకరం అని ఆహార నిపుణులు అంటున్నారు. ఇలా రాత్రి మిగిలిపోయిన చపాతీలను బాసీ రోటి అని పిలుస్తారు. ఇవి ఎంతో పోషకాలతో నిండి ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!


బాసీ రోటీ లేదా రాత్రి మిగిలిన చపాతీలు పోషకాలకు పవర్ హౌస్. గోధుమలతో చేసిన చపాతీలను మరుసటి రోజు తినడం వల్ల అవి గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి. బ్లడ్ షుగర్ ను పెంచకుండా చేస్తాయి. ఎక్కువసేపు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

బరువు తగ్గాలని అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు బాసీ రోటిని తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రాత్రి పూట నిల్వ చేసిన ప్రతి ఆహారం కిణ్వ ప్రకియకు లోనవుతుంది. కిణ్వ ప్రక్రియ అంటే ఆహారాన్ని పులియబెట్టడం. ఇలాంటి ఆహారంలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను దృఢంగా చేస్తుంది. రోగనిరోధక పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!


బాసీ రోటిలో ఐరన్, కాల్షియం, విటమిన్-బి తో సహా ఇతర ఖనిజాలు, విటమిన్లు కూడా సమృద్దిగా ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సిజన్ రవాణాకు కీలకమైన హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీవక్రియ, మెదడు పనితీరులో కీలకపాత్ర పోషిస్తాయి. ఐరన్, కాల్షియం, విటమిన్-బి సప్లిమెంట్లు తీసుకునేవారు వాటికి బదులు బాసీ రోటీ తినడం ఉత్తమం.

Walking Tricks: ఈ 5 ట్రిక్స్ ఫాలో అయితే చాలు.. వాకింగ్ లో ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు..!

Foot Fungal Infection: మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యతో పెద్ద ముప్పే..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 30 , 2024 | 10:49 AM

Advertising
Advertising
<