Covid 19: కరోనా సోకిన మహిళల్లో దీర్ఘకాలిక వ్యాధులు.. గైనకాలజీ జర్నల్‌లో ఆందోళనకర విషయాలు
ABN, Publish Date - Jul 13 , 2024 | 06:35 AM
గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.
ఢిల్లీ: గర్భధారణ సమయంలో కరోనా(Covid 19) సోకిన మహిళలకు దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయని ప్రసూతి, గైనకాలజీ జర్నల్ ప్రచురించింది. కరోనా సోకిన ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలైన అలసట, జీర్ణకోశ సమస్యలు తదితరాలతో బాధపడుతున్నట్లు అధ్యయనం కనుగొంది.
ప్రెగ్నెన్సీ సమయంలో కరోనా చాలా ప్రమాదకరమైనదని.. అది ముందస్తు ప్రసవాలు, జననాలకు దారి తీసిందని నివేదించింది. ఈ అధ్యయనంలో గతంలో కరోనా సోకిన 1,500 మంది మహిళలు పాల్గొన్నారు.
వీరిని ఆరు నెలలపాటు పరీక్షించి నివేదిక విడుదల చేశారు. వీరిలో 9.3 శాతం మంది దీర్ఘకాలిక లక్షణాలు ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. కరోనా సోకిన గర్భిణులు ప్రసవం అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.
For Latest News and National News click here
Updated Date - Jul 13 , 2024 | 06:35 AM