ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Low BP: లో బీపీ సమస్య ఉందా? ఈ 3 వస్తువులు వెంట ఉంచుకుంటే మంచిది..!

ABN, Publish Date - Aug 28 , 2024 | 05:15 PM

అధిక రక్తపోటు కంటే తక్కువ రక్తపోటు ఉన్నవారికే ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారికి తల తిరగడం, మూర్ఛ, బలహీనత, కంటిచూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటాయి.

Low BP

అధిక రక్తపోటు గురించి ఆందోళన పడేవారు చాలామంది ఉంటారు. చాలామందికి అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. కానీ తక్కువ రక్తపోటు గురించి ఎవరూ ఎక్కువ పట్టించుకోరు. కానీ అధిక రక్తపోటు కంటే తక్కువ రక్తపోటు ఉన్నవారికే ప్రమాదాలు ఎక్కువ పొంచి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారికి తల తిరగడం, మూర్ఛ, బలహీనత, కంటిచూపు మసకబారడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఉంటాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారికి బయటకు వెళ్ళినప్పుడో.. ప్రయాణాలలోనో.. ఉన్నట్టుండి బీపీ మరింత తగ్గిపోవడం జరుగుతుంది. ఇలాంటి వారు తమ వెంట 3 పదార్థాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే లో బీపీ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..


Hair Care: ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలడం ఆగడమే కాదు.. జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది..!



బాదం..

తక్కువ రక్తపోటుతో బాధపడేవారు ఎప్పుడూ తమతో బాదం ఉంచుకోవాలి. బాదం రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. బయటకు వెళ్లినప్పుడు, బలహీనంగా అనిపించినప్పుడు, రక్తపోటు తగ్గిందని అనిపించినప్పుడు కొన్ని బాదం పప్పులు తినాలి. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

తులసి ఆకులు..

తులసి ఆకులు రక్తపోటును నిర్వహించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. లో బీపీ ఉన్నవారు తులసి ఆకులు తింటే కంట్రోల్ లోకి వస్తుంది.


ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!



డార్క్ చాక్లెట్..

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు డార్క్ చాక్లెట్ గొప్ప ఊరట ఇస్తుందని అంటారు. అయితే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే కాదు.. రక్తపోటును నియంత్రించడంలో కూడా డార్క్ చాక్లెట్ ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి రక్త దమనులను విస్తరించే ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది.


ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!


ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

  • లో బీపీ తో బాధపడుతున్నవారు శరీరంలో నీటి కొరత లేకుండా చూసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ కు గురిం కాకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి. ఎక్కడికి వెళ్లినా మంచినీరు వెంట తీసుకెళ్లాలి.

  • ఒకే సారి ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం పట్ల దృష్టి పెట్టాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. ఇది రక్తపోటును బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

  • ఎక్కువసేపు కూర్చుని ఉండటం లేదా పడుకుని ఉండటం వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. దీనికారణంగా తలనొప్పి కూడా వస్తుంది. అందుకే ఎక్కువసేపు కూర్చోవడం, పడుకోవడం చేయకూడదు.

  • శారీరక శ్రమ శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ కనీసం 30 నిమిషాల నుండి 1 గంటసేపు వ్యాయామానికి కేటాయించుకోవాలి.

  • ఆల్కహాల్, కెఫిన్ తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. ఇది రక్తపోటు సమస్యను పెంచుతుంది.

ఇవి కూడా చదవండి..

అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!

ఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే ఇవి తినండి చాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 28 , 2024 | 05:15 PM

Advertising
Advertising