Mango Peel: మామిడి పండు తిని తొక్క పడేస్తున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..!
ABN, Publish Date - May 28 , 2024 | 05:49 PM
పండ్లలో రారాజుగా మామిడి పండ్లను పేర్కొంటారు. వేసవి కాలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అద్భుతమైన రుచితో పాటు, పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే చాలామంది మామిడి పండు లోపల గుజ్జు తిని మామిడి తొక్కలు పడేస్తుంటారు. కానీ ఈ మామిడి తొక్కలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.
పండ్లలో రారాజుగా మామిడి పండ్లను పేర్కొంటారు. వేసవి కాలంలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అద్భుతమైన రుచితో పాటు, పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే చాలామంది మామిడి పండు లోపల గుజ్జు తిని మామిడి తొక్కలు పడేస్తుంటారు. కానీ ఈ మామిడి తొక్కలతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. మామిడి తొక్కలో విటమిన్ ఎ , సి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కోలిన్, పొటాషియం మాత్రమే కాకుండా ఫైబర్, మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. మామిడి పండు లోపలి గుజ్జుతో పాటు మామిడి తొక్కను కూడా తినలేని వారు వాటిని ఈ కింది మార్గాలలో తీసుకోవచ్చు.
మామిడి తొక్కతో టీ తయారుచేసుకోవచ్చు. మామిడి తొక్కలను నీటిలో ఉడికించాలి. దీంట్లో కొద్దిగా తేనె. నిమ్మరసం కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మామిడి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
మామిడి తొక్కలను కూడా ఊరగాయ పెట్టవచ్చని మీకు తెలుసా? కేవలం ఊరగాయగా మాత్రమే కాదు.. వీటిని స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. మామిడి తొక్కలకు వెనిగర్, ఉప్పు ఊరగాయ మసాలాలు కలిపి కొన్ని రోజులు నిల్వ చేయాలి. ఆ తరువాత చాలా టేస్టీగా ఉంటుంది.
మామిడికాయ తోనే కాదు.. మామిడి తొక్కతో కూడా చట్నీ చేయవచ్చు. దీంతో చట్నీ తయారుచేసి పకోడాలు, సమోసాలు వంటి స్నాక్స్ తో తినవచ్చు.
మామిడి తొక్కలను ఉపయోగించి జామ్ తయారుచేయవచ్చు. మామిడి తొక్కలను పంచదారలో వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఇందులో ఏలకులు, దాల్చిన చెక్క వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది.
మామిడి తొక్కలను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని కూరలు, సూపులలో కలుపుకోవచ్చు.
Viral video: బైక్ నడుపుతూ ఏకంగా పొలాన్ని దున్నేయచ్చా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!
మామిడి తొక్కలను కూడా కేవలం తినడానికే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగించవచ్చు. ఎండిన మామిడి తొక్కలతో స్ర్కబ్ తయారుచేయవచ్చు. మృత కణాలను తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. మామిడి తొక్కలు నానబెట్టిన నీటితో షాంపూ తర్వాత జుట్టు కడుక్కోవడానికి ఉపయోగించాలి. మామిడి తొక్కలను స్కిన్ టోనర్ గా కూడా ఉపయోగించవచ్చట. మామిడి తొక్కలను నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టాలి. ఈ నీరు చల్లారిన తరువాత స్ప్రే బాటిల్ లో పోసి టోనర్ గా ఉపయోగించాలి.
ఈ 9 అలవాట్లు పిల్లలను మేధావులను చేస్తాయి..!
మీకు కోపం ఎక్కువా? అయితే ఇలా కంట్రోల్ చేసుకోండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - May 28 , 2024 | 05:50 PM