ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Milk: రాత్రిపూట పాలు తాగే అలవాటుందా? ఈ సమస్యలు ఉన్నవారు తాగకూడదట..!

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:27 PM

పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ పాలను ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పాలను ఉదయం లేదా సాయంత్రం తాగేవారు ఉంటారు. అయితే కొందరు మాత్రం రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగుతుంటారు. కానీ..

milk

పాలు సమతుల ఆహారంలో భాగం. రోజూ పాలు తీసుకుంటే ముఖ్యంగా కాల్షియం లోపం రాదు. పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ పాలను ఆహారంలో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పాలను ఉదయం లేదా సాయంత్రం తాగేవారు ఉంటారు. అయితే కొందరు మాత్రం రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగుతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు పాలు తాగడం కొన్ని సమస్యలున్న వారికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. ఇంతకీ రాత్రి పడుకునేముందు పాలు ఎవరు తాగకూడదో తెలుసుకుంటే..

Raksha Bandhan: భద్ర కాలం అంటే ఏమిటి? రాఖీ పౌర్ణమి రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి?



కడుపు ఉబ్బరం..

రాత్రి పడుకునే ముందు పాలు తాగడం జీర్ణ సంబంధ సమస్యలున్న వారికి మంచిది కాదు. పాలలో అధిక ప్రోటీన్, లాక్టోస్ ఉంటుంది. ఈ రెండు కడుపు ఉబ్బరానికి దారి తీస్తాయి. దీని కారణంగా నిద్రలేమి సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నిద్రలేమి..

రాత్రి పూట పాలు తాగితే నిద్ర బాగా వస్తుందని కొందరు అంటూంటారు. కానీ నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట పాలు తాగితే త్వరగా నిద్ర రాదు. నిద్రలో మెలకువ, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి.

అజీర్ణం..

అజీర్ణం సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి పూట పాలు తాగకూడదు. ఇది కడుపునొప్పి, మలబద్దకం, అజీర్ణం కారణంగా ఇతర పొట్ట సంబంధ సమస్యలకు దారి తీస్తుంది.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..!



కఫం..

కఫం సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రిపూట పాలు తాగకూడదు. రాత్రిపూట పాలు తాగితే శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. దీని కారణంగా గొంతులో కఫం పేరుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. ఇది నిద్రకు చాలా ఆటంకం కలిగిస్తుంది.

అధిక బరువు..

అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో పాలు తాగకూడదు. పాలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. రాత్రి పూట పాలు తాగితే కేలరీలు శరీరంలో పేరుకుపోవడానికి దారితీస్తుంది. మరింత బరువు పెరగడానికి దారితీస్తుంది.

Hot Water: బరువు తగ్గాలంటే వేడి నీరు ఎప్పుడు తాగాలి? వైద్యులు చెప్పిన నిజాలివి..!



మధుమేహం..

పాలలో ఉండే గ్లూకోజ్ లెవల్స్ మధుమేహం ఉన్నవారిని ఇబ్బంది పెడతాయి. రాత్రి పడుకునేముందు పాలు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణం అవుతాయి.

Skin Care: రాత్రిపూట ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వయసు పెరిగినా చర్మం బిగుతుగా యవ్వనంగా ఉంటుంది..!

White Hair: హెన్నాలో ఈ రెండు మిక్స్ చేసి రాస్తే చాలు.. తెల్ల జుట్టుకు రంగు వెయ్యక్కర్లేకుండా నల్లగా అవ్వుద్ది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 17 , 2024 | 12:27 PM

Advertising
Advertising
<