ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Monsoon Tips: ఈ ఒక్క పానీయం తాగితే చాలు.. వర్షాకాలంలో గ్యాస్, ఎసిడిటీ మిమ్మల్ని టచ్ చేయవు..!

ABN, Publish Date - Jun 25 , 2024 | 03:49 PM

వర్షాకాలంలో వేడిగా, కారంగా ఉన్న ఆహారాలు తినడానికి ఇష్టపడతారు. ఇవి మాత్రమే కాదు ఈ సీజన్‌లో లభించే కూరగాయల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో పండే కూరగాయలలో అనేక రకాల క్రిమికీటకాలు ఉంటాయి, వీటిని సరిగా శుభ్రపరచకుండా వండితే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే..

ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాతావరణం మారినప్పుడు చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. వర్షాకాలంలో వేడిగా, కారంగా ఉన్న ఆహారాలు తినడానికి ఇష్టపడతారు. ఇవి మాత్రమే కాదు ఈ సీజన్‌లో లభించే కూరగాయల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సీజన్ లో పండే కూరగాయలలో అనేక రకాల క్రిమికీటకాలు ఉంటాయి, వీటిని సరిగా శుభ్రపరచకుండా వండితే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య నుండి బయట పడాలంటే పెసరపప్పు నీరు తాగాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా పనిచేస్తుంది, వర్షాకాలంలో ఎదురయ్యే గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టే ఇతర టిప్స్ ఏంటి? తెలుసుకుంటే..

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!


పెసర పప్పు నీరు..

పెసరపప్పు నీటిని ఆయుర్వేదంలో పెసరకట్టు అని అంటారు. పెసరపప్పును ఉడికించేటప్పుడు బాగా నీరు కలపాలి. ఇది చాలా పలుచగా ఉంటుంది. ఈ పెసరకట్టులో నెయ్యి, మిరియాల పొడి కలిపాలి. దీన్ని ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో ఖాళీ కడుపుతో తాగాలి. కడుపుకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా ఈ పెసరకట్టు తాగడం వల్ల దూరం అవుతాయి. ఇది మాత్రమే కాకుండా పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గించే మరికొన్ని టిప్స్ కూడా ఉన్నాయి.

వర్షాకాలంలో పుదీనా తీసుకోవడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. పుదీనాను ఆహారంలో చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. పుదీనా ఆకులను పచ్చిగా నమలవచ్చు, పుదీనా నీటిని తాగవచ్చు లేదా పుదీనాను వంటలలో ఉపయోగించవచ్చు.

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!


పసుపు తీసుకోవడం వల్ల పొట్ట సంబంధ సమస్యలు దూరమవుతాయి. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పొట్టకు మేలు చేస్తాయి. ఇది జీర్ణక్రియ సమస్యలకు అద్భుతమైన ఆయుర్వేద నివారణ. పసుపును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు లేదా పసుపు నీటిని డిటాక్స్ డ్రింక్‌గా తాగవచ్చు.

వర్షాకాలంలో పొట్టకు సంబంధించిన సమస్యలను దూరం చేయడంలో దాల్చిన చెక్క అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దాల్చినచెక్కలో ఉంటాయి.

విటమిన్-డి శరీరంలో ఎక్కువ ఉంటే ఏం జరుగుతుందంటే..!

మహిళలలో కండరాలను బలంగా ఉంచే సూపర్ ఫుడ్స్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 25 , 2024 | 03:49 PM

Advertising
Advertising