ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Moringa Rice: ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచే మునగాకు రైస్.. చాలా రుచిగా ఇలా చేసేయండి..

ABN, Publish Date - Oct 23 , 2024 | 02:36 PM

మునగ కాయలే కాకుండా మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలామంచివి. మునగ ఆకులతో ఇలా రైస్ చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

Drumstick leaves Rice

మునగాకు ప్రాముఖ్యత ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తోంది. ఒకప్పుడు విరివిగా మునగ చెట్లు, మునగాకు అందుబాటులో ఉన్నా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం మధుమేహం, రక్తపోటు, రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మునగాకు వినియోగం పట్ల కూడా అవగాహన పెరిగింది. తినడానికి చాలా రుచిగా మునగాకును వండుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతాయి. మునగాకుతో రైస్ చేసుకుంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. మునగాకు తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో.. మునగాకు రైస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

ఈ పదార్థాలు తిన్న తరువాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు..


మునగాకు రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు..

పొడి కోసం..

  • నూనె.. స్పూన్..

  • వెల్లుల్లి.. 3-4

  • ఎండుమిరపకాయలు.. 2-3

  • చింతపండు.. కొద్దిగా

  • శనగపప్పు.. 2 టేబుల్ స్పూన్లు

  • మినపప్పు.. 2 టేబుల్ స్పూన్లు

  • జీలకర్ర.. 1స్పూన్

  • మిరియాలు.. కొద్దిగా

  • దనియాలు.. 1 టేబుల్ స్పూన్

  • నువ్వులు.. 1 టీస్పూన్

  • మునగ ఆకులు.. 1కప్పు

  • పసుపు.. అర స్పూన్

  • ఇంగువ.. కొద్దిగా

  • ఉప్పు.. రుచికి సరిపడా

పోపు కోసం..

  • అన్నం.. రెండు కప్పులు

  • నూనె.. 1 టేబుల్ స్పూన్

  • ఆవాలు.. 1 స్పూన్

  • మినపప్పు.. అర స్పూన్

  • శనగపప్పు.. అర స్పూన్

  • వేరుశనగ.. పావు కప్పు

  • జీడిపప్పు.. 5-6

  • ఎండుమిర్చి.. 2

  • కరివేపాకు.. ఒక రెమ్మ

పెసర మొలకలు తింటే.. ఈ సమస్యలున్న వారికి నష్టం తప్పదు..


ఇలా చేయాలి..

పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలుచింతపండు వేసి ఒక నిమిషం వేయించాలి. తరువాత శనగపప్పు, మినపప్పు, మిరియాలు, జీలకర్ర, దనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన దినుసులలో మునగ ఆకులు కూడా వేసి ఆకులు పచ్చిదనం పోయేవరకు వేగించాలి. తరువాత ఇందులో ఉప్పు వేసి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.

రైస్ ఇలా చేయాలి..

స్టౌ మీద కడాయి పెట్టి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, వేరుశనగ, జీడిపప్పు వేసి వేయించాలి. అందులోనే పోపు దినుసులు అన్నీ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. పోపులో రెండు కప్పుల అన్నం వేసి కలపాలి. ఇందులో తయారు చేసుకున్న మునగ ఆకుల పొడి రెండు నుండి మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి. ఉప్పు సరిచూసుకుని తక్కువైతే ఉప్పు జోడించాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరంగా ఉండే మునగాకుల రైస్ సర్వ్ చేయడానికి సిద్దం.

ఇవి కూడా చదవండి..

జుట్టు చిట్లుతోందా.. అసలు కారణాలు ఇవే..

తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 23 , 2024 | 02:36 PM