Neem Benefits: వేప ఆకులు వేసిన నీటితో స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ABN, Publish Date - Aug 11 , 2024 | 10:10 PM
Neem Benefits: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో వేప ఆకులు వేస్తారు. లేదంటే వేప ఆకులను నీటిలో మరిగించి.. ఆ నీటితో స్నానం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటో తెలుగు గనుకే పెద్దలు ఇలా స్నానం చేసేవారు.
Neem Benefits: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో వేప ఆకులు వేస్తారు. లేదంటే వేప ఆకులను నీటిలో మరిగించి.. ఆ నీటితో స్నానం చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఆ మేలు ఏంటో తెలుగు గనుకే పెద్దలు ఇలా స్నానం చేసేవారు. వాస్తవానికి వేప ఆకులు, బెరడు, పువ్వు, కాయలు సహా చెట్టులోని అణువణువూ ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. వేపలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హానీకరమైన ప్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వేప మంచి యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పని చేస్తుంది. అందుకే వేప నీళ్లతో స్నానం చేయడం వల్ల స్కిన్ ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
వేప నీటిలో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
మొటిమలు: వేప ఆకు నీళ్లతో స్నానం చేస్తే మొటిమల సమస్య తొలగిపోయి ముఖం మెరుస్తుంది. మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు సైతం తొలగిపోతాయి. వేప ఆకు నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. వేప ఆకులను పేస్ట్‌లా చేసి 2 స్పూన్ల పెరుగుతో కలిపి.. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేస్తే నల్ల మచ్చలన్నీ తొలగిపోతాయి.
కళ్ళకు ప్రయోజనాలు: కంటిలో ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా మంట ఉంటే వేప ఆకు నీరు ఈ సమస్యలను నయం చేస్తుంది. వేప ఆకు నీళ్లతో తలస్నానం చేసి కళ్లు కడుక్కుంటే ఇన్ఫెక్షన్, కళ్లు ఎర్రబడడం, కంటి వాపు వంటి సమస్యలు నయమవుతాయి.
చుండ్రు సమస్యకు చెక్: చుండ్రు బాధితులకు కూడా వేప ఉపయోగపడుతుంది. వేప నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వారానికోసారి వేప ఆకు నీటితో తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. వేప ఆకు నీటిని వాడేటప్పుడు షాంపూ వాడకపోవడమే మంచిది.
చెమట: కొందరికి విపరీతంగా చెమట పడుతుంది. ఫలితంగా చెమట వాసన వస్తుంది. దీనికి కారణం శరీరంలో ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా. అలాంటి పరిస్థితుల్లో వేపపూతతో స్నానం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చెమట దుర్వాసన పోతుంది.
For More Health News and Telugu News..
Updated Date - Aug 11 , 2024 | 10:10 PM