ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Oats Vs Poha: ఓట్స్ లేదా అటుకులు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? పోషకాహార నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు..!

ABN, Publish Date - Aug 03 , 2024 | 08:00 PM

ఓట్స్ , అటుకులు రెండింటిలో ఏది బెస్ట్ అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? నిజాలు ఇవే..

oats-poha

ఆరోగ్యకమైన ఆహారాలు శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలలో ఓట్స్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటిని బరువు తగ్గడం కోసమే కాకుండా మెరుగైన జీవక్రియ, మలబద్దకం నివారణ వంటి వాటికోసం కూడా వాడుతున్నారు. అటుకులు చాలా ఏళ్ల నుండి ప్రాచుర్యంలో ఉన్న ఆహారం. వీటిని టిఫిన్లలోనూ, దోసెలు, ఇడ్లీల తయారీలోనూ, స్నాక్స్ గానూ ఉపయోగిస్తారు. అయితే ఓట్స్ , అటుకులు రెండింటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఈ రెండింటిలో ఏది బెస్టో తెలుసుకుంటే..

నెయ్యితో మసాజ్ చేస్తే యవ్వనంగా మారతారా? ఆయుర్వేదం చెప్పిన నిజాలివీ..!


ఓట్స్..

  • ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో కరికే ఫైబర్ మాత్రమే కాకుండా కరగని పైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.

  • ఓట్స్ లో బీటా-గ్లూకాన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఓట్స్ లో మంచి మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి.

  • ఓట్స్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ ను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎక్కువసేపు శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ కారణంగా ఓట్స్ మధుమేహం ఉన్నవారికి కూడా మంచిది.

  • ఓట్స్ లో అటుకులతో పోలిస్తే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉన్నవారికి ఓట్స్ మంచి ఎంపిక.

ఈ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో జుట్టు రాలడం ఆగిపోతుంది..!



అటుకులు..

  • అటుకులలో కార్బోహైడ్రేట్స్, ఐరన్, కొంత మొత్తంలో పైబర్ ఉంటాయి. ఓట్స్ లో ఇవన్నీ ఉండవు.

  • ఓట్స్ తో పోలిస్తే అటుకులలో ఫైబర్ కంటెంట్ తక్కువ. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. కానీ ఫైబర్ విషయంలో ఓట్స్ కంటే అటుకులు తక్కువే.

  • అటుకులు కూడా ఒక రకమైన బియ్యం నుండే తయారుచేస్తారు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచడానికి కారణం అవుతుంది.

  • అటుకులలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కానీ వీటిని వండే క్రమంలో వేరుశనగ, శనగలు, మినపగుండ్లు, నిమ్మరసం వంటివి జోడించడం ద్వారా వీటి ప్రోటీన్ కంటెంట్ ను మెరుగుపరుచుకోవచ్చు.

ఈ సమస్యలున్నవారు అవిసె గింజలు పొరపాటున కూడా తినకూడదు..!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకులు నమిలి తింటే.. వీరికి భలే లాభాలు..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 03 , 2024 | 08:00 PM

Advertising
Advertising
<