ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Olive Oil: సరైన ఆలివ్ ఆయివ్ ను ఎలా ఎంచుకోవాలి ? ఈ 5 చిట్కాలు ఫాలో అయితే సరి..!

ABN, Publish Date - Aug 30 , 2024 | 10:51 AM

ఆలివ్ ఆయిల్ లో ఉండే సమ్మేళనాలు, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడంలోనూ, శరీరం మొత్తానికి కూడా మేలు చేస్తాయి. మార్కెట్లో చాలా రకాల ఆలివ్ ఆయిల్ లు అందుబాటులో ఉంటాయి. వీటిలో సరైన ఆలివ్ ఆయిల్ ఎంపిక చేసుకోవడం

Olive Oil

ఆలివ్ ఆయిల్ ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఆహారంలో భాగం చేసుకుంటారు. ఆలివ్ ఆయిల్ లో ఉండే సమ్మేళనాలు, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడంలోనూ, శరీరం మొత్తానికి కూడా మేలు చేస్తాయి. మార్కెట్లో చాలా రకాల ఆలివ్ ఆయిల్ లు అందుబాటులో ఉంటాయి. వీటిలో సరైన ఆలివ్ ఆయిల్ ఎంపిక చేసుకోవడం కాసింత గందగోళానికి దారి తీస్తుంది. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ ను మొదటిసారిగా వాడాలి అనుకునే వారు ఆయిల్ ఎంపిక విషయంలో తప్పటడుగులు వేస్తారు. 5 సింపుల్ చిట్కాలతో పర్ఫెక్ట్ ఆలివ్ ఆయిల్ ను ఎంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

కేవలం ఈ 9 అలవాట్లతో మీరు జెమ్ అయిపోతారు..!


ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్..

ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మంచి గ్రేడ్ కు చెందినది. దీన్ని వేడి చేయకుండా తీస్తారు. అంటే కోల్డ్ ప్రెస్ లేదా రసాయనాల సహాయంతో ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీస్తారు. ఇది చాలా స్వచ్చమైనదిగా పరిగణింప బడుతుంది. ఇందులో పోషకాలు మెరుగ్గా ఉంటాయి.

లైట్ కలర్ బాటిల్స్ వద్దు..

ఆలివ్ నూనె నాణ్యత ఎంత బాగున్నా.. దాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగించే బాటిల్స్ విషయంలో జాగ్రత్త లేకపోతే అంతా వ్యర్థం అంటున్నారు ఆహార నిపుణులు. లేత రంగు సీసాలలో అమ్మే ఆలివ్ ఆయిల్ కొనుగోలు చేయకపోవడం మంచిది. సూర్య కిరణాలు సోకినప్పుడు ఈ లేత సీసాలలోని ఆలివ్ ఆయిల్ రాన్సిడిటీని కలిగిస్తుంది. ఇది నూనె నాణ్యతను దెబ్బతీస్తుంది. ఆలివ్ నూనె డబ్బా ఎప్పుడూ డార్క్ కలర్ లేదా పూత పూసిన గాజు సీసాలో ఉన్నదే కొనుగోలు చేయాలి.

మీకు తెలుసా? భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పాములు లేవు..!


హార్వెస్ట్ డేట్..

ఆలివ్ ఆయిల్ బాటిల్ మీద ఆలివ్స్ హార్వెస్ట్ తేదీ ఉంటుంది. ఇది నూనె నాణ్యతను సూచిస్తుంది. ఆలివ్ నూనెను హార్వెస్ట్ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం నుండి 18 నెలల వరకు ఉపయోగించడం ఉత్తమం.

ఖరీదు..

ఆలివ్ ఆయిల్ ఉత్పత్తికి ఇటలీలో 8 నుండి 14 యూరోల వరకు ఖర్చు అవుతుంది. ఇది భారతీయ కరెన్సీలో రూ.725 నుండి రూ. 1200. దీని తరువాత షిప్పింగ్, దిగుమతి ఛార్జీలు కూడా ఉంటాయి. అంటే ఆలివ్ నూనె ఖరీదు ఎక్కువ. చౌకగా లభించే ఆలివ్ నూనెను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఇది నాణ్యత లేనట్టే..

మూలం..

కొన్నిసార్లు లేబుల్ మీద ఉన్న దేశాల పేర్లు చూసి ఆ దేశంలే పెరిగిన లేదా తయారు చేయబడిన మంచి బ్రాండ్ అని అపోహ పడుతుంటారు. అయితే లేబుల్ మీద ఉన్న దేశం లేదా రాష్ట్రం అనేవి ప్రోడక్ట్ ను ఆ ప్రాంతంలో ప్యాక్ చేశారని అర్థం.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో చాలామందికి తెలియని రహస్య టూరిస్ట్ ప్రాంతాలు ఇవి..!

జీలకర్ర నీరు ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..!

జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 30 , 2024 | 10:51 AM

Advertising
Advertising