Pani Puri: పానీపూరి తిన్నా ఆరోగ్య లాభాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలివీ..!
ABN, Publish Date - Jul 26 , 2024 | 01:59 PM
పానీపూరి భారతీయ స్ట్రీట్ ఫుడ్ లో రారాజుగా పరిగణింపబడుతుంది. చిన్నా పెద్దా అందరూ పానీపూరీ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలు పానీపూరి తో చాలా ఎమోషన్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. అయితే..
పానీపూరి భారతీయ స్ట్రీట్ ఫుడ్ లో రారాజుగా పరిగణింపబడుతుంది. చిన్నా పెద్దా అందరూ పానీపూరీ తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అమ్మాయిలు పానీపూరి తో చాలా ఎమోషన్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో ఫారినర్లు కూడా భారతదేశానికి విచ్చేసి పానీపూరికి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు. నోట్లో పెట్టుకోగానే పుల్లగా, క్రంచీగా.. నములుతుంటే ఉల్లిపాయ, బంగాళదుంప, శనగల మిశ్రమంతో కలిసి ఓ మహత్తరమైన పంచ్ ను నాలుకకు అందిస్తుంది పానీపూరి. చాలామంది పానీపూరిని కేవలం రుచికోసం తింటూంటారు. అయితే ఇకమీదట ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పుకుంటూ తినచ్చు. పానీపూరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
Aluminum Foil: ఆహారం ప్యాక్ చెయ్యడానికి అల్వూమినియం ఫాయిల్ వాడచ్చా? దిమ్మతిరిగిపోయే నిజాలివీ..!
పానీపూరిలో స్టఫ్ చేసే మిశ్రమాన్ని శనగలతో తయారుచేస్తారు. ఈ శనగలలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. శనగల మిశ్రమాన్ని స్టప్ చేసే పానీపూరి తినడానికి ప్రయత్నించండి.
పానీపూరి స్టఫింగ్ లో పొటాషియం, విటమిన్-సి, పైబర్ వంటివి ఉంటాయి. ఇవి కండరాల ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు మంచివి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
ఉల్లిపాయ, శనగలు, బంగాళదుంప, మొదలైనవాటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో ఉంటాయి.
పానీపూరిలో తయారు చేసిన పానీలో విటమిన్-సి, ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా సహాయపడతాయి.
Health Tips: చిన్న వయసులోనే పెద్ద వారిలా కనబడుతున్నారా? ఈ నాలుగు అలవాట్లే కొంప ముంచుతున్నాయ్..!
పానీపూరీ పానీ తయారీలో జీలకర్ర, కొత్తిమీర, పుదీన, అల్లం మొదలైనవి ఉపయోగిస్తారు. ఇవి జీర్ణక్రియకు చాలా బాగా సహాయపడతాయి. కడుపులో మంటను తగ్గిస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మలబద్దకం సమస్యను కూడా తగ్గిస్తాయి.
బరువు తగ్గాలని అనుకునేవారు కేలరీలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పానీపూరి దీనికి సరైన ఎంపిక. కేలరీలు చాలా తక్కువ. కడుపు నిండిన ఫీల్ కూడా ఇస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. అందుకే ఇది బరువు తగ్గాలని అనుకునేవారికి బెస్ట్ స్నాక్ గా సహాయపడుతుంది.
Kidney: శరీరంలో ఈ అవయవాలలో వాపు కనిపిస్తే కిడ్నీ సమస్యలున్నట్టే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!
జాగ్రత్త..
పానీపూరి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ బయట వీధులలో పానీపూరీ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ్రత లేని ప్రదేశాలలో పానీపూరీ తినడం మంచిది కాదు. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు చాలా కలుషితం అవుతుంది. ఈ సీజన్ లో బయట పానీపూరీ తినకపోవడం మంచిది. కాస్త ఓపికతో ఇంట్లోనే పానీపూరి తయారుచేసుకుని ఇంటిల్లిపాది తినడం కుటుంబం మొత్తానికి మంచి అనుభూతిని ఇస్తుంది.
ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!
వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Jul 26 , 2024 | 01:59 PM