ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dinner Mistakes: రాత్రి సమయంలో ఈ ఆహారాలు తినడం మానకపోతే చాలా నష్టపోతారు..

ABN, Publish Date - Nov 07 , 2024 | 08:31 PM

ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది.

Dinner Mistakes: రాత్రి సమయంలో ఈ ఆహారాలు తినడం మానకపోతే చాలా నష్టపోతారు..

ఆహారమే ఔషధం అని అంటారు ఆరోగ్య నిపుణులు, పెద్దలు. శరీరంలో ఏదైనా జబ్బు చేస్తే దానికి తగినట్టు ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలా వరకు అనారోగ్యం వీలైనంత తొందరగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారాల వల్ల శరీరం ఇబ్బంది పడుతుంది. మరీ ముఖ్యంగా శరీరం ఆరోగ్యంగా ఉన్నా కొన్ని ఆహారాలను తీసుకునే సమయం కారణంగా డిస్టర్బ్ అవుతుంది. రాత్రి సమయంలో తీసుకునే ఆహారాలు కూడా ఆరోగ్యాన్ని అలాగే ఇబ్బంది పెడతాయి. అందుకే రాత్రి సమయంలో కొన్ని ఆహారాలు అస్సలు తీసుకోవద్దని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వల్ల శరీరంలో సిర్కాడియన్ చక్రం, గట్ ఫ్లోరా దెబ్బతింటాయట. ఇంతకీ రాత్రి తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..

కెఫీన్..

కెఫీన్ కలిగిన టీ లేదా కాఫీ లను రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల సిర్కాడియన్ సైకిల్ కు అంతరాయం కలుగుుతంది. ఇది నిద్రపోయే స్థితి నుండి శరీరాన్ని బయటకు తీసుకొచ్చి శరీరాన్ని మెలకువలో ఉండే స్థితికి నెట్టివేస్తుంది. నిద్ర వేళకు 8 గంటల ముందు వరకు కెఫీన్ తీసుకోకుండా ఉండటం మంచిది.


చాక్లెట్ లేదా డెజర్ట్..

భోజనం తరువాత స్వీట్స్ లేదా చాక్లెట్ వంటివి తినడం చాలామంది అలవాటు. అయితే దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట. రాత్రి సమయంలో వీటిలో కేలరీలు ఖర్చు కాకపోవడం వల్ల అవి కొవ్వుగా మారి నిల్వ ఉండిపోతాయి. ఇవి బరువు పెరగడానికి దారి తీస్తాయి.

పిండి పదార్థాలు..

పిండితో చేసిన పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా షుగర్, ఇన్సులిన్ స్పైక్ లు ఏర్పడతాయి. పిండి పదార్ఖాలు జీవక్రియలో చక్కెరగా రూపాంతరం చెందుతాయి. ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి.


కారం, వేపుళ్లు..

కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు, వేపుళ్లు రాత్రి పూట తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇవి గట్ ఫ్లోరాను దెబ్బతీస్తాయి. పైగా రాత్రి సమయంలో వీటిని తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. రాత్రి సమయంలో ఇలాంటి ఆహారం జీర్ణం చేయడం గట్ ఎంజైమ్ లకు చాలా కష్టంగా ఉంటుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Health Tips: టీ, బిస్కెట్.. ఈ కాంబినేషన్ గురించి మీకు తెలియని నిజాలివీ..

Updated Date - Nov 07 , 2024 | 08:31 PM