Phool Makhana: మగవాళ్లకు ఫూల్ మఖానా చేసే మేలెంత? మీకు తెలియని నిజాలివి..!
ABN, Publish Date - Oct 07 , 2024 | 04:05 PM
ఫూల్ మఖానా చాలామంది స్నాక్స్ గానూ, ఉపవాస సమయాలలోనూ, డైటింగ్ లోనూ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇవి మగాళ్లకు చేసే మేలు ఎంతంటే..
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల ఆహారాలు సహాయపడతాయి. సాధారణ ఆరోగ్యం కోసం అందరూ అన్నీ తింటారు. కానీ ఒక వయసుకు వచ్చాక మగవాళ్లకు, ఆడవారికి శరీరంలో కలిగే మార్పులు, శరీర అవసరాలకు తగినట్టు ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలు ఋతుక్రమ సమస్యలు రాకూడదన్నా, గర్బం దాల్చాలన్నా వైద్యులు ప్రత్యేక ఆహారాలు ఎలాగైతే సూచిస్తారో.. మగవారికి కూడా ప్రత్యేక ఆహారాలు చెబుతూ ఉంటారు. చాలామంది ఆహారంలో భాగంగా తీసుకునే ఫూల్ మఖనా మగవాళ్లకు చాలా ప్రయోజనాలు చేకూరుస్తుందట. ఇంతకీ మగవాళ్లకు ఫూల్ మఖానా చేసే మేలు ఏంటో తెలుసుకుంటే..
చర్మాన్ని యవ్వనంగా ఉంచే విటమిన్-ఇ పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవే..!
ఫూల్ మఖానా..
ఫూల్ మఖానాను చాలా మంది స్నాక్స్ గానూ, తీపి పదార్థాల తయారీలోనూ, ఉపవాస సమయాల్లోనూ తీసుకుంటారు. మఖానాలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి.
మగవాళ్లకు ఎంత మేలు..
పురుషులలో చాలామంది కండరాలు పెంచడానికి సతమతం అవుతుంటారు. అయితే మఖానాలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఓ గుప్పెడు ఫూల్ మఖానా తింటూ ఉంటే కండరాలు బలపడతాయి. వీటిని వ్యాయామానికి ముందు అయినా, ఆ తరువాత స్నాక్స్ సమయంలో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు.
శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!
స్మెర్మ్ కౌంట్..
ఫూల్ మఖానాలో జింక్ సమృద్దిగా ఉంటుంది. జింక్ లోపం ఉంటే పురుషులలో లైంగిక ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. అందుకే ఫూల్ మఖానాను రోజూ తీసుకుంటూ ఉంటే స్మెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు ఆరోగ్యంగా ఉంటాయి.
గుండె..
స్త్రీలతో పోలిస్తే మగవారిలో గుండె జబ్బులు అధికం. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మెగ్నీషియం చాలా ముఖ్యం. ఫూల్ మఖానాలో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్న వారు ఫూల్ మఖానాను ప్రతి రోజూ ఆహారంలో తీసుకుంటూ ఉంటే మంచిది.
ఈ 8 టిప్స్ ఫాలో అవుతుంటే చాలు.. ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!
మధుమేహం..
ఫూల్ మఖానా మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. డయాబెటిక్ రోగులు తమ ఆహారంలో ఫూల్ మఖానాను చేర్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
బరువు..
బరువు తగ్గడంలో కూడా ఫూల్ మఖానా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ మెరుగ్గా ఉంటుంది. మఖానా తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇది జీవక్రియకు కూడా సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
Facial Hair: ఫేషియల్ హెయిర్ సులువుగా ఇంట్లోనే తొలగించాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Red Apple Vs Green Apple: ఎరుపు లేదా ఆకుపచ్చ.. ఏ రంగు యాపిల్ పండు ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుందంటే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Oct 07 , 2024 | 04:05 PM